Begin typing your search above and press return to search.

అక్క దారిలో చెల్లి...ఇదేం ట్విస్ట్ అమ్మ‌డు!

అక్క మార్గాన్నే చెల్లి కూడా అనుస‌రిస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:30 PM GMT
అక్క దారిలో చెల్లి...ఇదేం ట్విస్ట్ అమ్మ‌డు!
X

అక్క మార్గాన్నే చెల్లి కూడా అనుస‌రిస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా అక్కా-చెల్లి అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. జాన్వీ క‌పూర్ మ‌రాఠీ చిత్రం `సైర‌త్` రీమేక్ గా `ధ‌డ‌క్` సినిమాతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఓ వాస్త‌వ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని మాతృక‌లో తెర‌కెక్కించి హిట్ అందుకున్నారు. దీంతో అదే బెస్ట్ లాంచింగ్ గా భావించి జాన్వీ ఆ స్టోరీని ఎంచుకుంది.


కానీ ఈ సినిమా బాలీవుడ్ యావ‌రేజ్ గా ఆడింది. జాన్వీ పాస్ మార్కుల‌తోనే న‌టిగా పాస్ అయింది. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా అక్క మార్గంలోనే ఎంట్రీ ఇస్తుంది. అమీర్ ఖాన్ కుమారుడు హీరోగా అద్వైద్ చంద‌న్ త‌మిళ్ లో హిట్ అయిన `ల‌వ్ టుడే` చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా ఖుషీ క‌పూర్ ని ఎంపిక చేసారు.

ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. ల‌వ్ టుడే త‌మిళ్ తో పాటు తెలుగులోనూ మంచి విజ‌యం సాధించింది. యూత్ కి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్ ఇది. అందుకే అమీర్ ఈ క‌థ‌లో కుమారుడిని లాక్ చేసాడు. హీరోయిన్ గా కొంత మందిని అనుకున్నా? చివ‌రిగా ప్రాజెక్ట్ లో ఖుషీ క‌పూర్ చేరింది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. వాస్త‌వానికి ఖుషీ డెబ్యూని క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తాన‌ని మాటిచ్చాడు.

ఖుషీ కోసం చాలా క‌థ‌లు సైతం విన్నాడు. కొంత మంది ఫేమ‌స్ ద‌ర్శ‌కుల్ని లైన్ లోకి తెచ్చాడు. స్టార్ హీరోల వార‌సుల్ని రంగంలోకి తేవాల‌ని చూసాడు. కానీ ఏవీ ఫ‌లించ‌లేదు. దీంతో లాంచింగ్ డిలే అవుతుతుంద‌ని భావించిన ఖుషీ `ల‌వ్ టుడే` తో లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కి కూడా పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. రెండు..మూడు నెలల్లోనే పూర్తిచేయోచ్చు.