Begin typing your search above and press return to search.

అంబానీ ఈవెంట్లో శ్రీ‌దేవి చిన్న‌కూతురు స్ట‌న్నింగ్

శనివారం అంబానీ కుటుంబం నిర్వహించిన గ్రాండ్ NMACC ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ (ఆర్ట్ ఎగ్జిబిష‌న్) ఈవెంట్‌కు బాలీవుడ్ ప్ర‌ముఖులు మొత్తం తరలివచ్చారు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 10:15 PM GMT
అంబానీ ఈవెంట్లో శ్రీ‌దేవి చిన్న‌కూతురు స్ట‌న్నింగ్
X

శనివారం అంబానీ కుటుంబం నిర్వహించిన గ్రాండ్ NMACC ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ (ఆర్ట్ ఎగ్జిబిష‌న్) ఈవెంట్‌కు బాలీవుడ్ ప్ర‌ముఖులు మొత్తం తరలివచ్చారు. కింగ్ ఖాన్ షారూఖ్ స‌హా కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, సుహానా ఖాన్ , ఖుషీ కపూర్ వంటి అందాల క‌థానాయిక‌లు ఈవెంట్లో అబ్బురపరిచారు. వేడుక ఇన్ సైడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

ఈవెంట్ నుంచి ఇంత‌కుముందే జాన్వీక‌పూర్ స్పెష‌ల్ లుక్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది. ఇంత‌లోనే ఖుషీ క‌పూర్ లుక్ కూడా రిలీజైంది. అక్కా చెల్లెళ్లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ అల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లో ప్రివ్యూలో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా ఖుషి క‌పూర్ త‌న సోద‌రి జాన్వీ కంటే భిన్న‌మైన లుక్ తో క‌నిపించింది. 60ల నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి! అనే క్యాప్ష‌న్ తో ఈ ఫోటోల‌ను ఖుషి స్వ‌యంగా త‌న ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. వేడుక‌లో వెన్యూ వ‌ద్ద‌ ఖుషి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో చెల‌రేగిపోయింది. ఖుషీ నీలం రంగు దుస్తులు ధరించి థై హై ఎలివేష‌న్ తో క‌నిపించింది. ఒక చిన్న నల్ల బ్యాగ్‌ని త‌న‌తో పాటే తీసుకుని వ‌చ్చింది. సోద‌రి జాన్వీ పింక్ డిజైన‌ర్ డ్రెస్ లో దేవ‌త‌ను త‌ల‌పించ‌గా, ఖుషి పూర్తిగా బాస్ వైబ్స్ తో ఆక‌ట్టుకుంటుంది.

ఎప్ప‌టిలాగే ఈవెంట్లో ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణితో భామ‌లంతా ఫోటోలు దిగారు. జాన్వీ- ఖుషి క‌పూర్ కూడా అత‌డితో ఫోటోలు దిగ‌గా, క‌త్రిన‌, సుహానా, స‌న‌యా లాంటి తార‌లు ఓర్రీతో ఫోటోలు దిగారు. అంబానీ కోడ‌లు రాధిక మ‌ర్చంట్, కుమార్తె ఇషా అంబానీతో కలిసి ఓర్రీ పోజులిచ్చాడు. ఇదే వేడుక‌లో మాధురీ దీక్షిత్‌ సహా భర్త డాక్టర్ శ్రీరామ్ నీనే, అనన్య పాండే, షాన్యా కపూర్, వారి తల్లులు భావనా పాండే, మహీప్ కపూర్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ తదితరులు ఉన్నారు. విద్యాబాలన్ - సిద్ధార్థ్ రాయ్ కపూర్ జంట వేడుక‌లో సంద‌డి చేసారు.

అంతకు ముందు డిసెంబర్ 20, 21 తేదీలలో అంబానీ యాజమాన్యంలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌ జరిగింది. ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ స‌హా షారుఖ్ ఖాన్ కుటుంబం, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ తదితరులు తమ పిల్లల ప్ర‌ద‌ర్శ‌న‌ను వీక్షించారు.