వ్యక్తిగత జీవితాన్ని తాకట్టు పెట్టలేనన్న స్టార్ కిడ్
పెద్ద కుమార్తె డేటింగుకి బోనీ కపూర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని కూడా ప్రచారం సాగింది.
By: Tupaki Desk | 14 Nov 2024 2:30 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాళ్ల నటనా జీవితం కంటే, డేటింగ్ జీవితం ఎప్పుడూ మీడియా హెడ్‌లైన్స్‌లో వేడి పెంచుతోంది. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం లోని యువకుడైన శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తోందని హిందీ మీడియాలో కథనాలొచ్చాయి. పెద్ద కుమార్తె డేటింగుకి బోనీ కపూర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని కూడా ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే ఇటీవల సహనటుడు వేదాంగ్ రైనాతో శ్రీదేవి - బోనీల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ సన్నిహితంగా మెలుగుతోందని, ఆ ఇద్దరూ విదేశీ విహారయాత్రకు వెళ్లారని కూడా కథనాలొచ్చాయి. అయితే అతడితో సాన్నిహిత్యం నిజమేనా? అని ప్రశ్నిస్తే దానికి ఖుషీ కపూర్ ఎప్పుడూ సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. ప్రతిసారీ మెలిక పెడుతూ డొంక తిరుగుడుగానే సమాధానం చెబుతోంది. ఇప్పుడు కూడా మరోసారి తన డేటింగ్ గురించి ప్రశ్నించగా, తన వ్యక్తిగత జీవితంపై అందరిలో ఆసక్తి ఉండటం సహజమని, కానీ తాను వ్యక్తిగత జీవితాన్ని ప్రయివేట్ గా ఉంచుతానని, కేవలం కెరీర్ పైనే శ్రద్ధ పెడుతున్నానని తెలిపింది.
హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఖుషీ తన వ్యక్తిగత జీవితంపై తనకున్న శ్రద్ధ గురించి చెబుతూ.. ``ఇలాంటివి పెద్దగా ఆలోచించాల్సిన విషయాలు కావు. మనం సెలబ్రిటీలుగా ప్రజల దృష్టిలో ఉన్నప్పుడు కొంత ఉత్సుకత ఉంటుందని అర్థం చేసుకున్నాను. కానీ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి, పనికి ప్రాధాన్యతనివ్వడానికి ప్రయత్నిస్తున్నాను`` అని తెలిపింది.
కొద్ది రోజుల క్రితం ఖుషీ- వేదాంగ్ కలిసి విహారయాత్రకు వెళ్లి ఉండవచ్చని పుకార్లు వచ్చాయి. వెకేషన్ నుంచి ఫోటోలు లీకైన తర్వాత ఖుషీ అర్ధరాత్రి పైజామా థీమ్డ్ పుట్టినరోజు పార్టీలో వేదాంగ్ కనిపించాడు. అక్కడ ఆమె స్నేహితులందరూ KK అనే ఇనిషియల్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన మ్యాచింగ్ పైజామాలను ధరించారు. వేదాంగ్ అక్కడ ఖుషీతో సన్నిహితంగా కనిపించాడు.
అయితే ఆ ఇద్దరూ తమ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి పెదవి విప్పకుండా ఎంతకాలం దాచగలరు? త్వరలోనే అధికారికంగా పబ్లిక్ కి చెబుతారరని అభిమానులు ఊహిస్తున్నారు. ఖుషీ ఇటీవలి వెకేషన్ ఫోటోలలో వేదాంగ్ పేరుతో అలంకరించిన బ్రాస్లెట్ ధరించి కనిపించింది. అది దేనికి సూచిక అని కూడా నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
జోయా అక్తర్ `ది ఆర్చీస్`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఖుషీ, వేదాంగ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత వారి స్నేహం వెల్లివిరుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ `నాదనియన్`లో ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ఖుషి కనిపించనుంది. జునైద్ ఖాన్‌తో కలిసి మరో చిత్రంలోను నటిస్తోంది.