సెల్లార్‌లో కిల్లర్ ఫోజులతో రెచ్చిపోయిన ఖుషి
తాజాగా మరో స్టన్నింగ్ ఫోటోషూట్‌తో కుర్రకారు మతులు చెడగొట్టింది ఈ నటవారసురాలు.
By: Tupaki Desk | 26 Jan 2025 3:00 AM GMTఖుషి కపూర్.. అనూహ్యంగా దూసుకొచ్చిన న్యూవేవ్.. కపూర్ ఫ్యామిలీ నుంచి తిరుగులేని ఫ్యాషనిస్టాగా వెలిగిపోతోంది. తన సోదరి జాన్వీ కపూర్ ని డామినేట్ చేస్తూ ఫ్యాషన్ పాఠాలు చెబుతోంది ఈ కుర్ర బ్యూటీ. తాజాగా మరో స్టన్నింగ్ ఫోటోషూట్‌తో కుర్రకారు మతులు చెడగొట్టింది ఈ నటవారసురాలు. ఖుషి ఫ్యాషన్ గేమ్, డ్రెస్ సెన్స్ ఇప్పుడు తన డెబ్యూ సినిమా రిలీజ్ ముందు పెద్ద చర్చగా మారాయి.
కపూర్ గాళ్ తాజా లుక్ హా* టాపిగ్గా మారింది. ఖుషీ ధరించిన థై హై, ఆఫ్ షోల్డర్ గౌన్ నిజంగా ఇన్నర్ సొగసును ఎలివేట్ చేస్తూ స్టన్నర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ యువతరం వాట్సాపుల్లో వైరల్ గా మారుతోంది. సెల్లార్ లో ఖుషి స్టన్నింగ్ ఫోజులు గుబులు పెంచుతున్నాయంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నైట్ పార్టీ కోసం వెళుతున్న ఖుషీ అద్భుతమైన డ్రెస్ లో చెలరేగియిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఖుషి కపూర్ నటించిన `లవ్ యాపా` చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రచారం కోసం ఖుషీ చాలా శ్రమిస్తోంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో ఖుషి కపూర్ కెమిస్ట్రీ గురించి, డ్యాన్సుల గురించి యువత ఆసక్తిగా ముచ్చటించుకుంటోంది. ఈ జంటపై సహచరుల్లో, ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. లవ్ యాపా తమిళ హిట్ సినిమా `లవ్ టుడే`కి రీమేక్.