ఖుషీ డేటింగ్ పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదే సమయంలో ఓ సరదా సంభాషణలో లవ్ యాపా దర్శకుడు అద్వైత్ చందన్ నేరుగా ఖుషికపూర్ డేటింగ్ గురించి ప్రస్థావించాడు.
By: Tupaki Desk | 31 Jan 2025 3:57 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి ఇద్దరు కుమార్తెల సినీకెరీర్, వృక్తిగత విషయాలపై అభిమానుల్లో చాలా ముచ్చట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ముచ్చట్లలో జాన్వీకపూర్, ఖుషికపూర్ బోయ్ ఫ్రెండ్స్ గురించి చాలా చర్చ సాగుతోంది. జాన్వీకపూర్ ఇప్పటికే రాజకీయ నాయకుడు సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉంది. ఆ ఇద్దరూ పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి జంటగా దర్శనానికి విచ్చేసారు. ఆ సమయంలో డేటింగ్ పుకార్లు షికార్ చేసాయి. ఓ ఇంటర్వ్యూలో శిఖర్ తమ చుట్టూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని బోనీకపూర్ జాన్వీ డేటింగ్ ని కన్ఫామ్ చేసారు.
అలాగే ఖుషికపూర్ తన బోయ్ ఫ్రెండ్ వేదంగ్ రైనా గురించి ఎప్పుడూ దాచలేదు. `ది ఆర్చీస్` వెబ్ సిరీస్ లో నటించినప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం, బాండింగ్ గురించి చాలా చర్చ సాగుతోంది. అయితే అధికారికంగా ఖుషీ తన ప్రేమాయణం గురించి కన్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి తన డెబ్యూ సినిమా `లవ్ యాపా` రిలీజ్ ప్రమోషన్స్ లో ఖుషి బిజీగా ఉంది.
ఇదే సమయంలో ఓ సరదా సంభాషణలో లవ్ యాపా దర్శకుడు అద్వైత్ చందన్ నేరుగా ఖుషికపూర్ డేటింగ్ గురించి ప్రస్థావించాడు. ఇప్పటికే తనకు ఒక బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు! అంటూ అతడు కన్ఫామ్ చేయడంతో అభిమానుల్లో మరోసారి ఇది చర్చగా మారింది.
లవ్యాపా సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్న ఖుషీ కపూర్ ఇటీవల తన పెంపుడు కుక్కలతో ఒక రీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లవ్యాపా హో గయా పాట ఈ రీల్ నేపథ్యంలో వస్తోంది. పప్పీతో ఖుషీ సరదాగా గడిపే సమయంలో ఈ వీడియోను చిత్రీకరించారు. ``మా నాన్న బిజీగా ఉన్నాడు కాబట్టి నేను LOVEYAPA కోసం ఒక చిన్న ప్రోమో వీడియో కోసం కుక్కలను నియమించాల్సి వచ్చింది`` అని ఖుషి ఫన్నీ వ్యాఖ్యను జోడించింది.
`లవ్యాపా` సహనటుడు యుక్తమ్ ఖోస్లా స్పందిస్తూ.. ఖుషీ రీల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ``అరే, చాలా అందంగా ఉన్నావు, ఇంకా అందంగా ఉన్నావు`` అని అతడు రాశారు. చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్, యుక్తమ్ ఖోస్లాకు జవాబిస్తూ ``ఆమెకు ఇప్పటికే ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు`` అని అన్నాడు. నీ సినిమా పాత్ర నుంచి బయటపడు.. అని కూడా సరదాగా వ్యాఖ్యానించాడు. దానికి జవాబుగా యుక్తమ్ ఖోస్లా స్మైల్ ఈమోజీలను షేర్ చేసాడు. ఖుషీ సింగిల్ అనుకుని యుక్తమ్ని టెంప్ట్ కావదొద్దనేది అద్వైత్ ఉద్దేశం. అయితే అతడు నోరు జారినా కానీ అసలు విషయం బయటపడింది. జిగ్రా నటుడు వేదంగ్ రైనాతో ఖుషి డేటింగ్ గురించి దర్శకుడు అద్వైత్ చందన్ ప్రస్థావించాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యతో ఖుషి కపూర్ డేటింగ్, బోయ్ ఫ్రెండ్ అధికారికమేనని నెటిజనులు ముచ్చటించుకోవడం విశేషం.
లవ్ యాపా చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ - ఫాంటమ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, గ్రుషా కపూర్, కికు శారద, తన్వికా పర్లికర్, దేవిషి మదన్, ఆదిత్య కుల్శ్రేష్ట్ తదితరులు నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. ప్రేమికుల దినోత్సవ కానుకగా ఈ చిత్రం విడుదలవుతోంది.