డైరెక్టర్ కూతురు పెళ్లిలో కళ్లన్నీ ఈ స్టార్ కిడ్‌పైనే
తాజాగా గోల్డ్ కలర్ లెహెంగాలో ఖుషీ కపూర్ ఎంతో అందంగా కనిపించింది. ఈ డిజైన్ ని తరుణ్ తహిలియానీ రూపొందించారు.
By: Tupaki Desk | 10 Dec 2024 3:30 PM GMTఅనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ - విదేశీ ప్రియుడు షేన్ గ్రెగోయిర్ వివాహం డిసెంబర్ 11న వైభవంగా జరగనుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రిటీ కిడ్స్ సందడి పీక్స్ కి చేరుకుంది. ఇంతకుముందు హల్దీ -మెహందీ వేడుకల నుంచి ఫోటలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ జంట డిసెంబర్ 9న ముంబైలో గ్లామరస్ కాక్‌టెయిల్ పార్టీని నిర్వహించారు.
ఈ పార్టీలో ఆలియా స్నేహితులంతా ఫుల్ గా చిల్ అయ్యారు. ఖుషీ కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్, అలయ ఎఫ్ మాజీ ప్రియుడు ఐశ్వరీ థాకరే, ఖుషీ కపూర్ -వేదాంగ్ రైనా సహా పలువురు ప్రీవెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. కానీ వీరంతా ఎవరికి వారు విడివిడిగా ఫోటోలకు పోజులిచ్చారు.
అయితే ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఖుషీ కపూర్ డిజైనర్ లుక్స్ అగ్గి రాజేస్తున్నాయి. ఇంతకుముందే రకరకాల డిజైనర్ దుస్తుల్లో ఫోజులిచ్చిన ఖుషీ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా గోల్డ్ కలర్ లెహెంగాలో ఖుషీ కపూర్ ఎంతో అందంగా కనిపించింది. ఈ డిజైన్ ని తరుణ్ తహిలియానీ రూపొందించారు. లెహంగాలో ఖుషి యువరాణి వైబ్స్ ను వెదజల్లుతోందని ప్రశంసలు కురుస్తున్నాయి. చిక్ బ్లౌజ్, స్కర్ట్, సొగసైన దుపట్టా, చోలీలో కటౌట్, అందమైన నెక్‌లైన్, తో ఆకట్టుకుంది.
వేదాంగ్ బంగారు - లేత గోధుమరంగు దుస్తుల్లో ఖుషితో పాటు మ్యాచింగ్ తొడుక్కున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఖుషి కపూర్ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో నటిగా పరిచయమైంది. తదుపరి సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది.