బ్రాండ్స్ పరిచయంలో గేమ్ ఛేంజర్ ఈ కపూర్ గాళ్
ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో యూనిక్ ఫ్యాషన్ సెన్స్ ఉన్న బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది.
By: Tupaki Desk | 29 Dec 2024 3:56 PM GMTజోయా అక్తర్ తెరకెక్కించిన 'ది ఆర్చీస్' వెబ్ సిరీస్ తో ఓటీటీకి పరిచయం అయింది ఖుషి కపూర్. తొలి ప్రయత్నానికి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. డెబ్యూ నటి ఖుషి పరిణతి చెందిన ప్రదర్శనలు ఇవ్వడానికి ఇంకా అనుభవం అవసరం అని విశ్లేషించారు. ప్రస్తుతం ఈ భామ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన అవకాశం అందుకుంది. పెద్ద తెరపై తొలి అవకాశమిది.
తాజా సమాచారం మేరకు జునైద్ ఖాన్ - ఖుషీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా 'లవేయాపా' విడుదలకు సిద్ధంగా ఉంది. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవేయాపా చిత్రం ప్రముఖ బాలీవుడ్ కుటుంబాల నుండి వచ్చిన ఇద్దరు కొత్త తారలను ఒకచోట చేర్చింది. ఈ చిత్రం 7 ఫిబ్రవరి 2025న విడుదల కానుంది.
తన మొదటి సినిమా విడుదలకు ముందే ఖుషి సోషల్ మీడియాల్లో భారీగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో యూనిక్ ఫ్యాషన్ సెన్స్ ఉన్న బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు, ఆభరణాలను ఈ నటవారసురాలు పరిచయం చేస్తుంది. అలాగే తాను ఎంచుకునే ఒక్కో డ్రెస్ ఖరీదు లక్షల్లో ఉంది. అరచేతిలో ఇమిడిపోయే మినీ హ్యాండ్ బ్యాగుల కోసం కూడా లక్షల్లో ఖర్చు చేస్తోంది. ఇటీవల కొన్ని వరుస ఫోటోషూట్లలో అత్యంత ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు, ఆభరణాలను ధరించి కనిపించింది. దుస్తులు, యాక్ససరీస్, మేకప్ మెటీరియల్ అన్నిటా ఖుషీ సాటి స్టార్లకు కాంపిటీటర్ గా మారింది. తాజాగా కరోలినా హెర్రెరా రెడ్ స్ట్రిప్డ్ లేస్ ఎంబ్రాయిడరీ ఆర్గాంజా గౌన్ ని ధరించి ఖుషి మెరిసిపోయింది. ఈ డిజైనర్ గౌన్ ధర సుమారు రూ.44000/- గా ఉంది.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా ఖుషీ కపూర్ పై ఇండస్ట్రీ ఫోకస్ ఉంది. దానికి తగ్గ రేంజులోనే ఖుషికి యూత్‌లో ఫాలోయింగ్ ఏర్పడింది. ఇంకా డెబ్యూ నటి అయినా ఖుషి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. ఇన్ స్టా, సోషల్ మీడియాల్లో యాడ్ పోస్టింగులు, మోడలింగుతోను సంపాదిస్తోంది. తండ్రి బోనీకపూర్, సోదరి జాన్వీ కపూర్ లతో కలిసి ఈ భామ రియల్ వెంచర్లలోను పెట్టుబడులు పెడుతోందని ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. ప్రస్తుతం కెరీర్ పైనా ఫోకస్సివ్ గా ఉంది. వరుసగా కథలు వింటోంది.. నచ్చిన స్క్రిప్టులకు కమిటవుతోందని సమాచారం. అయితే అధికారికంగా కొన్నిటిని కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.