Begin typing your search above and press return to search.

ఖుషీ క‌పూర్ తో బావ ఛోటా హిమేష్ ర‌ష్మియా!

జాన్వీ క‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా ప్రేమించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య‌ వ్య‌వ‌హారం అన‌ధికారంగా సాగుతుంది.

By:  Tupaki Desk   |   12 Sep 2024 8:14 AM GMT
ఖుషీ క‌పూర్ తో బావ ఛోటా హిమేష్ ర‌ష్మియా!
X

జాన్వీ క‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా ప్రేమించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య‌ వ్య‌వ‌హారం అన‌ధికారంగా సాగుతుంది. అదెప్పుడు అధికారికం అవుతందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ జాన్వీ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌డం లేదు. ఎవ‌రు ఎలా ఊహించుకున్నా ప‌ర్లేద‌ని నెటి జ‌నుల‌కే వ‌దిలేసింది. తాజాగా శిఖ‌ర్ ప‌హారియా-ఖుషీ క‌పూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కారిలా.

ఇలా ఇద్ద‌రు ఒక‌రు వెంట మ‌రొక‌రు న‌డుచుకెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇందులో ఎక్క‌డా జాన్వీ క‌పూర్ క‌నిపించ‌లేదు. శిఖ‌ర్ ప‌హారియా స్టైలిష్ గా ముస్తాబ‌య్యాడు. నెత్తికి టోపీ...ఫ్యాంట్ ష‌ర్ట్ లో క‌నిపిస్తున్నాడు. ఇక ఖుషీ క‌పూర్ కూడా వైంట్ అంట్ వైట్ వేర్ లో క‌నిపిస్తుంది. చేతిలో ఎరుపు రంగు హ్యాండ్ బ్యాంగ్ ఉంది. మ‌రి ఇద్ద‌రు జాన్వీ లేని స‌మ‌యంలో ఎక్క‌డికి వెళ్తున్నారో? ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

శిఖ‌ర్ ప‌హారియాని ఈ లుక్ లో చూసి జూనియ‌ర్ హిమేష్ ర‌ష్మియా అనేస్తున్నారు. అత‌డి ఆహార్యం, డ్రెస్సింగ్ సెన్స్ ర‌ష్మీయాని త‌ల‌పిస్తున్నాయి. బావ‌తో మ‌ర‌ద‌లు ఖుషీ ఎక్క‌డికి వెళ్తుంది? జాన్వీ క‌పూర్ ఏమంది? ఆమె లేకుండా వీరిద్ద‌రి ప్ర‌యాణం ఏంటి? అంటున్నారు. ఇక శిఖ‌ర్ ప‌హారియా బోనీ క‌పూర్ ఫ్యామిలీతో ఎంతో స్నేహంగా ఉంటాడు. జాన్వీ క‌పూర్ కి చిన్న నాటి స్నేహితుడు. త‌న బెస్ట్ ప్రెండ్.

ఇప్పుడు ప్రియుడు అయ్యాడు అనుకోండి. జాన్వీ కాల్ లిస్ట్ లో మొట్ట మొద‌టి నెంబ‌ర్ అత‌డితో ఉంటుంది. అంత క్లోజ్ గా ఆ ఫ్యామిలీతో ఉంటాడు. అలాగే ఖుషీ క‌పూర్ తెరంగేట్రానికి ముందే వేదాంగ్ రైనాతో ల‌వ్ స్టోరీ న‌డిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.