క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో గుండె గిల్లుతున్న ఖుషీ
ఖుషీ కపూర్ 24వ పుట్టినరోజు వేడుకలు ముంబైలో స్నేహితుల సమక్షంలో చిల్లింగ్ గా జరిగాయి.
By: Tupaki Desk | 6 Nov 2024 3:30 PM GMTఅందంగా నవ్వడం.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కవ్వించడం... కుర్రకారును ఆటపట్టించడం ఈ భామలకు కొత్తేమీ కాదు. నైట్ పార్టీలో స్నేహితులతో కలిసి బోలెడంత సందడి చేసే ఈ యంగ్ బ్యూటీస్ బర్త్ డే పార్టీలో ఏ రేంజులో చిలౌట్ చేసారో ఇదిగో ఇక్కడ ఫోటోలే సాక్ష్యం.
ఖుషీ కపూర్ 24వ పుట్టినరోజు వేడుకలు ముంబైలో స్నేహితుల సమక్షంలో చిల్లింగ్ గా జరిగాయి. ఈ ఈవెంట్లో ఖుషి తన తండ్రి గారైన బోనీకపూర్, బోయ్ ఫ్రెండ్ వేదాంగ్ రైనాలతో కలిసి ఫోజులివ్వగా, అందుకు సంబంధించిన ఫోటోల ఇప్పటికే నెట్ లో వైరల్ అయ్యాయి. ఐకానిక్ కెల్లీ బ్యాగ్ జతగా, చిక్ వైట్ మ్యాక్సీ దుస్తుల్లో ఖుషీ ఎంతో క్యూట్ గా కనిపించింది.
ఇంకా పాతిక ప్రాయంలోకి అయినా అడుగుపెట్టని ఖుషీ స్టైల్ ఐకన్ గా కుర్రకారు హృదయంలో చోటు సంపాదించుకుంది. ఈ కుర్రబ్యూటీ స్పెషల్ డేని సంపూర్ణంగా ఆస్వాధించింది. అయితే వేడుకలు అక్కడితో ఆగలేదు. స్నేహితులతో కలిసి విలాసవంతమైన విందు కూడా చేసింది. ఎప్పటిలాగే ఖుషీ ఫ్యాషన్ సెన్స్ ఈ వేదిక వద్ద హాట్ టాపిక్ గా మారింది. అద్భుతమైన తెల్లటి బాడీకాన్ దుస్తుల్లో ఖుషీ అందంగా కనిపించింది. జెన్ Z స్టైల్ ఐకాన్ అని మరోసారి రుజువు చేసింది. ఖుషీ కపూర్ మెడలో హారం.. చేతులపై పచ్చ బొట్లు కుర్రకారును విపరీతంగా ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
బ్యాగు ధర 33లక్షలు
ఖుషి ధరించిన దుస్తుల ధర ఎంత? అంటే.. సొగసైన దుస్తులు సొలేస్ లండన్ బ్రాండ్ షెల్ఫ్‌లలో ఉన్నాయి దీని ధర £149.. దీని విలువ రూపాయల్లో సుమారు రూ.15,000. ఖుషి హ్యాండ్ బ్యాగ్ హెర్మేస్ కెల్లీ బ్రాండ్. బ్యాగ్ ధర $39,765, అంటే దాదాపు రూ.33 లక్షలు.