ఆ విషయంలో అక్కనే మించిపోయేలా ఉందే!
ఇదంతా హీరోయిన్ కాక ముందే..ఇక నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మామ్ ఇమేజ్ తో ఇంకే స్థాయికి రీచ్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 14 July 2024 12:30 PM GMTఖుషీ కపూర్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే అమ్మడు ఫాలోయింగ్ లోపీక్స్ కి చేరుతుంది. ఇప్పటికే అమ్మడి ఖాతాలో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదంతా హీరోయిన్ కాక ముందే..ఇక నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మామ్ ఇమేజ్ తో ఇంకే స్థాయికి రీచ్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా లో ఇప్పటికే ఖుషీ హాట్ అందాలతో ఎన్నో ఫోటోలను పోస్ట్ చేసింది.
స్విమ్ షూట్లు..బికినీ దుస్తులు సంగతి పక్కనబెడితే డిజైనర్ దుస్తుల్లో ఎప్పటికప్పుడు తనదైన మార్క్ వేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ విషయంలో అమ్మడు అక్క జాన్వీకపూర్ నే ఫాలో అవుతుంది. తెలివిగా అక్క నుంచి చెల్లి కాపీకొడుతూ ఇన్ స్లాలో పాపులారిటీని రెట్టింపు చేసుకుంటుంది. తాజాగా మరో డిజైనర్ పిక్ తో నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడ ఖుషీ కపూర్ ముస్తాబైన విధానం చూస్తే అందమంతా ఖుషీ సొంతమా? అనిపించక మానదు.
వైట్ కలర్ డిజైనర్ బాడీ కార్న్ దుస్తుల్లో ఖుషీ ఎంతో అందంగా కనిపిస్తుంది. వైట్ క్లాత్ పై ఆ డిజైన్ ఎంతో బ్యూటీని జోడించింది. టాప్ టూ బాటమ్ జాన్వీ శరీరాన్ని కవర్ చేస్తూ ధరించిన దుస్తుల్లో ఎంతో ఆకర్ష ణీయంగా కనిపిస్తుంది. నెక్ పై వైట్ డిజైన్ తో కూడిన నెక్లెస్, చెవులకు అదే రంగు బుట్టలు ధరించింది. నుదిటిన సన్నని బొట్టు ఖుషీ ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ బ్యూటీలో ఖుషీ ని చూసి అభిమానులు స్టన్ అవుతారు? అంత అందంగా హైలైట్ అయ్యేది ఖుషీనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే భవిష్యత్ లో అక్క జాన్వీకి ఇంట్లోనే పోటీ తయారయ్యేలా ఉందంటున్నారు. ఇక నటిగా ఖుషీ కపూర్ ని కరణ్ జోహార్ పరిచయం చేస్తోన్న సంగతి తెలిసిందే.