Begin typing your search above and press return to search.

క‌పూర్ బ్యూటీ నుదిట‌న న‌ట భూష‌ణ్ రింగ్!

ఇదిగో ఇక్క‌డిలా మ‌ల్టీక‌ల‌ర్ డిజైర‌న్ ఔట్ ఫిట్ లో మిరుమిట్లు గొలుపుతుంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 2:30 AM GMT
క‌పూర్ బ్యూటీ నుదిట‌న న‌ట భూష‌ణ్ రింగ్!
X

ఖుషీ క‌పూర్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోయ‌న్ గా ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే అమ్మ‌డు ఫాలోయింగ్ లోపీక్స్ కి చేరుతుంది. ఇప్ప‌టికే అమ్మ‌డి ఖాతాలో మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇదంతా హీరోయిన్ కాక ముందే..ఇక న‌టిగా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మామ్ ఇమేజ్ తో ఇంకే స్థాయికి రీచ్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టా లో ఇప్ప‌టికే ఖుషీ హాట్ అందాలతో ఎన్నో ఫోటోల‌ను పోస్ట్ చేసింది.


తాజాగా అమ్మ‌డు మ‌రో కొత్త ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా మ‌ల్టీక‌ల‌ర్ డిజైర‌న్ ఔట్ ఫిట్ లో మిరుమిట్లు గొలుపుతుంది. టాప్ టూ బాట‌మ్ సింగిల్ డిజైన్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీన్..ముస్తాబైన విధానం చూప‌రుల‌ను ఆక‌ట్టుకుటుంది. ముఖ్యంగా అమ్మ‌డి హెయిర్ స్టైల్ సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది.


నుదిటిన చిన్న హెయిర్ రింగును యాడ్ చేసింది. న‌ట భూష‌ణ్ శోభ‌న్ బాబు రింగులా హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి ఫాలోవ‌ర్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదే ఏడాది అమ్మ‌డు న‌టిగా లాంచ్ అవుతుంది. దీంతో ఖుషీ ఇన్ స్టా యాక్టివిటీని మ‌రింత స్పీడ‌ప్ చేసింది. వ‌రుస ఫోటో షూట్ల‌తో అల‌రిస్తుంది. ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను అంత‌కంత‌కు పెంచుకుంటుంది.


ఇప్ప‌టికే `ది అర్చిస్` తో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే అది ఓటీటీకే ప‌రిమిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ప‌రిచ‌యం చేసే బాధ్య‌త క‌ర‌ణ్ జోహార్ తీసుకున్నారు. త‌న బ్యాన‌ర్లోనే హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నారు. తొలి సినిమాకంటే ముందే రెండ‌వ సినిమా కూడా అదే బ్యాన‌ర్ లో అగ్రిమెంట్ చేసుకున్నారు.