Begin typing your search above and press return to search.

ప్లాస్టిక్ స‌ర్జ‌రీ నిజ‌మే.. సింపుల్‌గా ఒప్పుకున్న ఖుషి

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి రెండో కుమార్తె, జాన్వీ క‌పూర్ సోద‌రి ఖుషి కపూర్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు ఒప్పుకుంది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 3:40 AM GMT
ప్లాస్టిక్ స‌ర్జ‌రీ నిజ‌మే.. సింపుల్‌గా ఒప్పుకున్న ఖుషి
X

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి రెండో కుమార్తె, జాన్వీ క‌పూర్ సోద‌రి ఖుషి కపూర్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు ఒప్పుకుంది. పాత వీడియోని ప్ర‌ద‌ర్శిస్తూ దానిపై ఆరా తీసిన నెటిజ‌న్‌తో ఇన్‌స్టాలో ఖుషీ తన సినిమా అరంగేట్రం చేయడానికి ముందు ముక్కు, పెద‌వుల‌(లిప్ ఫిల్లర్స్)ను శ‌స్త్ర చికిత్స‌తో స‌రి చేయించుకున్న‌ట్టు వెల్లడించింది.

ఈ వీడియోలో `ఖుషి` తన తల్లి శ్రీదేవితో కలిసి ఒక ఈవెంట్‌కు హాజరైంది. అప్ప‌టికి త‌ను చిన్నపిల్ల. కానీ ఇప్పుడు టీనేజీ అమ్మాయి. త‌న‌ మొదటి ఓటీటీ చిత్రం `ది ఆర్చీస్` ప్రీమియర్ తో ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలో వీడియో అది. ఖుషి పాత రూపం గురించి ఒక నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. దానికి వెంట‌నే ప్రతిస్పందనగా ఖుషీ ఈ ప్రక్రియ నిజ‌మేన‌ని సింపుల్ వ్యాఖ్యతో ధృవీకరించింది.

ఈమోజీల‌తో అది నిజ‌మేనంటూ ఖుషి క‌పూర్ సింపుల్ గా అంగీక‌రించ‌డం నిజానికి నెటిజ‌న్‌కు షాక్ నిచ్చింది. చాలా మంది నెటిజ‌నులు ఖుషి నిజాయితీని మెచ్చుకున్నారు. ఒక నెటిజ‌న్ ఇలా వ్యాఖ్యానించారు. ``ఇలా నిజాయితీగా చెప్పేయ‌డం వ‌ల్ల ఆమె న‌చ్చింది. అది త‌న‌ ఎంపిక. ఆ విష‌యంలో నటించలేదు`` అని కాంప్లిమెంట్ ఇచ్చారు. స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్టు ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు దానిని తిరస్కరించడంలో అర్థం లేదు. చాలా మంది నటీమణులు ఒప్పుకుంటారు కానీ... కొంద‌రు అలా కాదు. కానీ ఖుషీ మాత్రం ముందుంది. అయితే జాన్వీ కపూర్ గురించి నెటిజ‌న్‌ చేసిన వ్యాఖ్యలతో ఖుషి విభేదించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఖుషీ ఇంత‌కుముందు త‌న స్నేహితుడు వేదాంగ్ రైనాతో క‌లిసి `ది ఆర్చీస్‌`లో నటించింది. ఇటీవల ఇండియా కోచర్ వీక్‌లో డిజైనర్ గౌరవ్ గుప్తా షోలో షోస్టాపర్‌లుగా కనిపించారు. ఒకరికొకరు సుఖంగా కలిసి పనిచేయడం ఆనందంగా ఉంటుందని ఖుషీ మళ్లీ వేదాంగ్‌తో కలిసి పని చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేసింది.

మ‌రోవైపు అక్క జాన్వీ బాట‌లోనే ఖుషి కపూర్ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల మీడియా క‌థ‌నాల‌ ప్ర‌కారం.. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ స‌ర‌స‌న ఆరంగేట్రం చేయడానికి చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. సెప్టెంబర్ 1న మోక్షజ్ఞ తొలి చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌నుండ‌గా దీనిపై మ‌రింత స్ప‌ష్ఠత వ‌చ్చే వీలుంది. ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.

ఖుషి ఇప్ప‌టికే హిందీలో `ది ఆర్చీస్` అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. అలాగే రెండు హిందీ చిత్రాల్లోను న‌టిస్తోంది. త‌దుప‌రి టాలీవుడ్ ఎంట్రీపై ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు ఖుషి క‌పూర్ సోషల్ మీడియా క్వీన్ గా, మ్యాగ‌జైన్ క‌వ‌ర్ గాళ్‌గా యువ‌త‌రంలో గిలిగింత‌లు పెడుతోంది. వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.