Begin typing your search above and press return to search.

డేట్ అడ‌గాలంటే? టిప్స్ చెప్పిన యువన‌టి!

ఎవరినైనా డేట్ అడగడానికి ఖుషీ కపూర్ స్ట్రాటజీ ఏమిటో వెల్లడించింది. డేట్అడ‌గాలంటే.. ఒక‌రికొక‌రు త‌మ ఆస‌క్తుల‌ను తెలుసుకోవాలి.

By:  Tupaki Desk   |   20 Jun 2024 3:30 AM GMT
డేట్ అడ‌గాలంటే? టిప్స్ చెప్పిన యువన‌టి!
X

ఖుషీ క‌పూర్ 'ది ఆర్చీస్' ఓటీటీ సిరీస్‌తో నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు పెద్ద తెర కోసం న‌టిస్తోంది. మ‌రోవైపు ఖుషీ వేదాంగ్ రైనాతో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఒకరితో డేట్ చేయాలంటే త‌న స్ట్రాట‌జీ ఏంటో ఇప్పుడు పాపుల‌ర్ మీడియాకు వెల్ల‌డించింది. మీకు మీరు క‌రెక్ట్‌గా నిజాయితీగా ఉండే వ్య‌క్తి అయితే ఇత‌ర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం...సంబంధాలు.. స్నేహాలను పెంచుకోవడం చాలా సులభం అని నేను భావిస్తున్నాను! అని ఖుషి తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

ఎవరినైనా డేట్ అడగడానికి ఖుషీ కపూర్ స్ట్రాటజీ ఏమిటో వెల్లడించింది. డేట్అడ‌గాలంటే.. ఒక‌రికొక‌రు త‌మ ఆస‌క్తుల‌ను తెలుసుకోవాలి. ఆ త‌ర్వాత మాటా మాటా క‌ల‌ప‌డం అనేది ఇమిడి ఉందని ఖుషీ కపూర్ అన్నారు. నేను భాగస్వామితో ఆసక్తిని కోరుకుంటాను. అటుపై మా సంభాషణ‌ల్ని రూపొందించుకుంటాను. పరస్పర ఇష్టాలను కనుగొంటాను. ఉదాహరణకు ఎదుటి వ్యక్తికి సినిమాలంటే ఇష్టం. నాకు క్రీడలపై ఆసక్తి. అయినా అర్థం చేసుకోవాలి. కొత్త కార్యకలాపాలను అన్వేషించడం డేట్ ప్రొఫైల్‌లోని నా గురించి విభాగాన్ని చదవడం ఆస‌క్తి క‌లిగిస్తుంద‌ని ఖుషి పేర్కొంది.

ఇంతకు ముందు మేమిద్దరం ప్రయత్నించని కొత్త, ఆనందదాయకమైన కార్యకలాపాన్ని అన్వేషించడం కనెక్ట్ కావడానికి ఒక అద్భుతమైన మార్గం. నా డేట్ ప్రొఫైల్‌లోని నా గురించి విభాగాన్ని చదవడం వలన మీరు మాట్లాడే టాపిక్స్‌కి స‌హ‌క‌రిస్తుంది.. అని ఖుషీ చెప్పేసింది. త‌న‌కు డేట్ ఎలా ఉండాలి అంటే.. ఒక క‌చ్ఛిత‌మైన తేదీ.. ప్ర‌ర‌యివేట్ గా క‌లుసుకోవాల‌ని ఉంటుంద‌ట‌. డేట్ వ‌ల్ల‌ నేను మరింత వ్యక్తిగతంగా చొర‌వ‌గా మాట్లాడటం సాధ్య‌ప‌డుతుంది. అవతలి వ్యక్తిని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఇది రిలాక్స్‌గా, సరదాగా ఉంటుంది! అని 23 ఏళ్ల ఖుషి చెప్పింది.

డేటింగ్ అప్లికేషన్ బంబుల్ కోసం 'ఓపెనింగ్ మూవ్' ప్రచారంలో చేరిన ఖుషీ ఆన్‌లైన్ డేటింగ్ ప్రపంచంలో నావిగేట్ చేసే యువకులకు చాలా టిప్స్ చెప్పింది. అమ్మాయి అబ్బాయి మ‌ధ్య దాప‌రికం అన్న‌దే లేకుండా చేసే ప‌నిలో బహిరంగంగా, ప్రామాణికంగా ఉండటం చాలా ముఖ్య‌మ‌ని ఖుషి చెప్పింది. అర్ధవంతమైన సంతృప్తికరమైన సంబంధాలతో స్నేహాలను నిర్మించడం చాలా సులభం అని కూడా ఖుషీ పేర్కొంది. తనకు తానుగా నిజాయితీగా ఉండటం సహాయపడుతుందని వెల్ల‌డించింది.