Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నంద‌మూరి నాయిక కాబోయే వేళ..!

తాజాగా బ్రైడ‌ల్ ఆసియా క‌వ‌ర్ పేజీపై ఖుషి స్ట‌న్నింగ్ లుక్ తో క‌నిపించింది. ముఖ్యంగా సోద‌రి జాన్వీతో పోటీప‌డుతూ త‌న గ్లామ‌ర్ ని ఆవిష్క‌రించేందుకు ఖుషి సిద్ధంగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   6 Aug 2024 2:27 PM GMT
ఫోటో స్టోరి: నంద‌మూరి నాయిక కాబోయే వేళ..!
X

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ టాలీవుడ్ లో ఘ‌న‌మైన‌ ఆరంగేట్రం చేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న జాన్వీ రంగ ప్ర‌వేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌లోనే శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోందంటూ ప్ర‌చారం సాగుతోంది. తాజా ఊహాగానాల ప్ర‌కారం.. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ స‌ర‌స‌న ఆరంగేట్రం చేయడానికి చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. సెప్టెంబర్ 1న మోక్షజ్ఞ తొలి చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌నుండ‌గా, సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.

ఖుషి ఇప్ప‌టికే హిందీలో 'ది ఆర్చీస్' అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. అలాగే రెండు హిందీ చిత్రాల్లోను న‌టిస్తోంది. త‌దుప‌రి టాలీవుడ్ ఎంట్రీపై ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు ఖుషి క‌పూర్ సోషల్ మీడియా క్వీన్ గా, మ్యాగ‌జైన్ క‌వ‌ర్ గాళ్‌గా యువ‌త‌రంలో గిలిగింత‌లు పెడుతోంది. తాజాగా బ్రైడ‌ల్ ఆసియా క‌వ‌ర్ పేజీపై ఖుషి స్ట‌న్నింగ్ లుక్ తో క‌నిపించింది. ముఖ్యంగా సోద‌రి జాన్వీతో పోటీప‌డుతూ త‌న గ్లామ‌ర్ ని ఆవిష్క‌రించేందుకు ఖుషి సిద్ధంగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఖుషి తొలి నుంచి త‌న‌ను గ్లామ‌ర‌స్ క్వీన్ గా ఎలివేట్ చేసుకునేందుకే ఆస‌క్తిగా ఉంది. త‌న సోష‌ల్ మీడియాల్లో హాట్ ఫోటోషూట్లకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. మ‌రోవైపు ఖుషి క‌పూర్ త‌న స‌హ‌న‌టుడు వేదాంగ్ రైనాతో ప్రేమ‌లో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. కానీ చాలా సార్లు ఖుషి త‌న స్నేహితుడు వేదాంగ్ తో క‌లిసి క‌నిపించింది. ఇటీవ‌ల ఓ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో ఈ ఇద్ద‌రూ జంట‌గా ర్యాంప్ వాక్ చేసిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి.