Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జేబులెక్కువ.. జాబు త‌క్కువ‌..!

ఇటీవ‌లే ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు అన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 4:57 PM GMT
ఫోటో స్టోరి: జేబులెక్కువ.. జాబు త‌క్కువ‌..!
X

అవును.. జేబులెక్కువ‌... జాబు త‌క్కువ‌.. ఎవ‌రీ బ్యూటీ? కాటుక క‌ళ్లు.. పోనీ టెయిల్..నాభి కేంద్రం.. న‌డుము ఒంపులు.. థై సొగ‌సులు.. ఒకే ఒక్క ఫోటోలో ఇన్ని షోస్ చూపించింది.... ఇంత‌కీ ఎవ‌రీ అందాల కుర్ర‌ భామ‌? ఇంకా రంగుల ప్ర‌పంచంలో బుడి బుడి న‌డ‌క‌ల్లోనే ఉన్న ఈ న‌ట‌వార‌సురాలు ఎవ‌రో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు.. ఈ భామ పేరు ఖుషీ క‌పూర్. ఇటీవ‌లే ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు అన్న సంగ‌తి తెలిసిందే. అదంతా అటుంచితే... కొన్నాళ్లుగా ఖుషీ ఫ్యాష‌న్ షోస్ మాత్రం కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తున్నాయని అంగీక‌రించాలి. తాజాగా GQ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్ అవార్డ్స్ 2024 వేడుక‌ల్లో ఖుషీ ఇలా త‌ళుక్కుమంది. వేదిక వ‌ద్ద క‌ళ్ల‌న్నీ ఈ భామ‌నే వెంటాడాయంటే అతిశ‌యోక్తి కాదు. ఓవైపు స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు.. మ‌రోవైపు అహూతులు ఖుషీ స్పెష‌ల్ లుక్ పై ఫోక‌స్ చేయ‌డంతో అక్క‌డ ఈ బ్యూటీ షో స్టాప‌ర్ గా మారింది.


క్రీమ్ క‌ల‌ర్ డిజైన‌ర్ టాప్.. కాంబినేష‌న్ క్రీమ్ క‌ల‌ర్ బాట‌మ్‌లో ఖుషీ చాలా స్పెష‌ల్‌గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఖుషీ క‌పూర్ 6 అడుగుల బుల్లెట్టులా త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శిస్తూ ఎంతో ఆక‌ర్షించింది. ముఖ్యంగా ఖుషీ స‌న్న‌జాని కాళ్ల సౌంద‌ర్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపిస్తోంది. ఖుషీ లుక్ ముందు ఇత‌రుల రొటీన్ వేష‌ధార‌ణ‌లు ఒక ర‌కంగా తేలిపోయాయ‌ని చెప్పాలి. అయితే త‌న డిజైన‌ర్ టాప్.. డిజైన‌ర్ బాట‌మ్ ల‌కు పెద్ద సైజ్ పాకెట్స్ హెడ్ ట‌ర్న‌ర్ గా మారాయి. జేబులెక్కువే ఉన్నాయి... డ‌బ్బు అంత దండీగా సంపాదిస్తోందా? అంటూ అభిమానులు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు. `ది ఆర్చీస్` త‌ర్వాత ఖుషీ క‌పూర్ పూర్తిగా కెరీర్ ప‌రంగా బిజీ అయిపోతోంది. త‌దుప‌రి సైఫ్ ఖాన్ వార‌సుడు ఇబ్ర‌హీం అలీఖాన్ స‌ర‌స‌న ఖుషీ ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.


అంద‌గ‌త్తెల స్పెష‌ల్ షో:

ఇక ఇదే అవార్డుల వేదిక‌పై న‌య‌న‌తార‌, సన్యా మ‌ల్హోత్రా, పాల‌క్ తివారీ సహా ప‌లువురు ప్ర‌త్యేక డిజైన‌ర్ దుస్తుల్లో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించారు. భూమి పెడ్నేకర్ ఐవరీ-హ్యూడ్ కటౌట్ దుస్తులలో తన వంపులను ప్రదర్శించగా, డిజైనర్ కునాల్ రావల్ రెడ్ కార్పెట్‌పై అద‌ర‌గొట్టాడు. ఈ కార్యక్రమంలో అలీ ఫజల్, రిచా చద్దా, కునాల్ కెమ్ము, అక్షయ్ ఒబెరాయ్, తాహిర్ రాజ్ భాసిన్, సన్నీ సింగ్, చెఫ్ రణవీర్ బ్రార్, మన్నారా చోప్రా, కుబ్రా సైత్ వంటి ప్ర‌ముఖులు సంద‌డి చేసారు.