Begin typing your search above and press return to search.

మెల్లగా అక్క అందంను మ్యాచ్‌ చేస్తున్న జూ.కపూర్‌

నటిగా కంటే కూడా టెక్నీషియన్ గా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ అనుభవంను దక్కించుకున్న ముద్దుగుమ్మ ఖుషి కపూర్‌. త్వరలోనే రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాల్లో నటించాలని ఆశ పడుతోంది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 8:27 AM GMT
మెల్లగా అక్క అందంను మ్యాచ్‌ చేస్తున్న జూ.కపూర్‌
X

అతిలోక సుందరి శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా కమర్షియల్ బ్రేక్‌ దక్కలేదు. కానీ అందం విషయం లో బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ జాబితాలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనేది నెటిజన్స్ టాక్‌.


అందాల ఆరబోత విషయంలో జాన్వీ కపూర్‌ ఒక అడుగు ముందే అన్నట్లుగా ఉంది. ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉండే ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ఆ అందాల ఆరబోత కారణంగానే స్టార్‌ హీరోయిన్‌ స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉంది. అక్క జాన్వీ కపూర్ కి ఏమాత్రం తగ్గకుండా చెల్లి ఖుషి కపూర్‌ స్కిన్‌ షో మొదలు పెట్టింది.


నటిగా కంటే కూడా టెక్నీషియన్ గా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ అనుభవంను దక్కించుకున్న ముద్దుగుమ్మ ఖుషి కపూర్‌. త్వరలోనే రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాల్లో నటించాలని ఆశ పడుతోంది. బాలీవుడ్‌ లోనే చేయాలి అనే ఆలోచన లేకుండా సౌత్‌ నుంచి ఆఫర్‌ లు వస్తే తప్పకుండా చేస్తానంటూ ఇటీవల ఖుషి కపూర్‌ చెప్పుకొచ్చింది.

తాజాగా ఖుషి కపూర్‌ షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నడుము అందం చూపిస్తూ సైడ్ యాంగిల్‌ లో అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ ఖుషి కపూర్‌ మెల్ల మెల్లగా అందాల ఆరబోత విషయం లో అక్క జాన్వీ కపూర్‌ ని మ్యాచ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.. మరి ఖుషి కపూర్‌ వరుస సినిమాలు చేయాలి అంటే అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోత చేయాల్సిన అవసరం ఉందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.