Begin typing your search above and press return to search.

అక్క -చెల్లి మ‌ధ్య చాలా వ్య‌త్యాస‌మే ఉందండోయ్!

తాజాగా ఖుషీ క‌పూర్ ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ అవుతుంది. అందులో అమ్మ‌డు చిట్టి పొట్టి దుస్తుల్లో క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 8:26 AM GMT
అక్క -చెల్లి మ‌ధ్య చాలా వ్య‌త్యాస‌మే ఉందండోయ్!
X

బాలీవుడ్ సిస్ట‌ర్స్ జాన్వీక‌పూర్-ఖుషీ క‌పూర్ ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జాన్వీ స్టార్ అయినా త‌గ్గ‌లేదు. ఖుషీ క‌పూర్ తెరంగేట్రానికి ముందు ఇన్ స్టాని షేక్ చేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో అక్కాచెల్లెళ్లిద్ద‌రు సెగ‌లు పుట్టిస్తుంటారు. క‌లిసొచ్చినా..క‌లిసి రాక‌పోయినా ఇన్ స్టాని హీటెక్కిం చ‌డంలో ఒక‌రికొక‌రు పోటీ ప‌డ‌తార‌న‌డంలో సందేహం లేదు. మ‌రి అతిలోక సుంద‌రి శ్రీదేవి ర‌క్తం పంచుకున్న సిస్ట‌ర్స్ ఇద్ద‌రిలో కామ‌న్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పెద్ద‌గా క‌నిపించ‌వు.


జాన్వీ..ఖుషీ ఫేస్ నుంచి కాలి పాదం వ‌ర‌కూ చాలా వ్య‌త్యాస‌మే క‌నిపిస్తుంది. ఎవ‌రి బ్యూటీ స్పెషాల్టీ వారిది. మ‌రి ఇద్ద‌రిలో హైట్ ఎవ‌రు? అంటే అక్క క‌న్నా చెల్లెలే ఎక్కువ ఎత్తు అని తెలుస్తోంది. తాజాగా ఖుషీ క‌పూర్ ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ అవుతుంది. అందులో అమ్మ‌డు చిట్టి పొట్టి దుస్తుల్లో క‌నిపిస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేష‌న్ లో కుషీ క‌పూర్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఆ దుస్తులే జాన్వీ..ఖుషీ మ‌ధ్య ఎత్తు వ్య‌త్యా సాన్ని గుర్తు చేస్తున్నాయి.


జాన్వీ 1.63 మీట‌ర్లు ఎత్తుని క‌లిగి ఉంటే చెల్లెలు ఖుషీ క‌పూర్ 1.72 మీట‌ర్లని క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. జాన్వీ పాత ఫోటోల్ని...ఖుషీ కొత్త ఫోటోని ప‌క్క‌ప‌క్క‌న బెట్టి పొలి క‌లు..కొల‌త‌లు కంపారిజ‌న్ చేస్తున్నారు నెటి జ‌నులు. అన్ని విష‌యాల్లో అక్కాచెల్లి మ‌ధ్య చాలా వ్య‌త్యాస‌మే ఉందంటున్నారు. హైట్ కూడా మ్యాచ్ అవ్వ‌డం లేద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.


ఇక ఖుషీ క‌పూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతంది. 'ది అర్చిస్' వెబ్ సిరీస్ అనేది అమ్మ‌డిని పూర్తి స్థాయిలో లాంచ్ చేసే చిత్రం కాదు. దీంతో బోనీ క‌పూర్ చిన్న కుమార్తె విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జాన్వీ విష‌యంలో దొర్లిన త‌ప్పిదాలు ఖుషీ విష‌యంలో రిపీట్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.