రీ రిలీజ్ ట్రెండ్.. ఖుషి రికార్డ్ ఒక్కరోజులోనే స్మాష్
పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రికార్డ్ ని దళపతి గిల్లి మూవీ ఒక్క రోజులోనే జెట్ స్పీడ్ లో బ్రేక్ చేయడం విశేషం.
By: Tupaki Desk | 22 April 2024 4:15 AM GMTఈ మధ్యకాలంలో రీరిలీజ్ ట్రెండ్ తెలుగు, తమిళ్ భాషలలో జోరుగా సాగుతోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలని మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి పాత సినిమాలకి ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఒకటి, రెండు రోజులు మాత్రమే రీరిలీజ్ చేసిన సినిమాలని థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. రీసెంట్ గా తెలుగులో నాని జెర్సీ మూవీ రీరిలీజ్ అయ్యింది.
రీరిలీజ్ అయిన సినిమాలకి మంచి కలెక్షన్స్ వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ అసోసియేషన్స్, కొంత మంది చిన్న నిర్మాతలు పాత హిట్ మూవీస్ ని కొనుగోలు చేసి రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా రీరిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి అని పేరు వినిపించేది.
ఆ సినిమా న్యూ ఇయర్ వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఏకంగా 7.46కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పది రోజుల పాటు ఖుషి చిత్రాన్ని థియేటర్స్ లో ప్రదర్శించారు. ఖుషి కలెక్షన్స్ రికార్డ్ ని ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఈ ట్రెండ్ లో కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ గిల్లి ఇప్పుడు బ్రేక్ చేయడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ సూపర్ హిట్ మూవీ ఒక్కడు రీమేక్ గా తమిళంలో గిల్లి తెరకెక్కింది..
తాజాగా గిల్లి చిత్రాన్ని తమిళనాట రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకి దళపతి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఒక్క రోజులోనే ఈ మూవీకి 7.92 కోట్ల గ్రాస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రికార్డ్ ని దళపతి గిల్లి మూవీ ఒక్క రోజులోనే జెట్ స్పీడ్ లో బ్రేక్ చేయడం విశేషం. ఈ సినిమా మరికొద్ది రోజులు థియేటర్స్ లో ప్రదర్శితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని గిల్లి అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే గిల్లి రికార్డ్ ని రీరిలీజ్ అయ్యే ఏ ఇతర సినిమా కూడా బ్రేక్ చేయలేకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఖుషి మూవీ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి మిగిలిన స్టార్స్ కి చాలా సమయం పట్టింది. అలాంటిది ఇప్పుడు గిల్లి మూవీ డబుల్ డిజిట్ కలెక్షన్స్ కి అందుకోవడానికి ఇంకెంత టైం పడుతుందో చూడాలి. వీరిద్దరూ తెలుగు, తమిళ్ భాషలలో టాప్ స్టార్స్ గా ఉన్నారు. లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఈ కారణంగానే ఈ హీరోలకి సినిమాలకి అద్భుతమైన ఆదరణ వస్తుందని చెప్పాలి.