Begin typing your search above and press return to search.

ఖుషి టైటిల్ సాంగ్… సమంతనే స్పెషల్

ఈ సాంగ్ లో సమంత తన బ్యూటీనెస్ అద్భుతంగా ఆవిష్కరించింది. సమంత అంటే స్టైలిష్ కి కేరాఫ్ అడ్రస్

By:  Tupaki Desk   |   29 July 2023 11:36 AM GMT
ఖుషి టైటిల్ సాంగ్… సమంతనే స్పెషల్
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి సమంత. ఈ బ్యూటీ ఇండస్ట్రియల్ అడుగుపెట్టి దశాబ్దం పైగా అవుతుంది. ఆయన ఎప్పటికీ తన ఛరిష్మాని అలాగే కొనసాగిస్తుంది. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అందులో భాగంగా సిటాడెల్ వెబ్ సిరీస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. హిందీలో డబ్బింగ్ మూవీ చేయడానికి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండకు జోడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో ఖుషి మూవీ రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్, టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో సమంత తన బ్యూటీనెస్ అద్భుతంగా ఆవిష్కరించింది. సమంత అంటే స్టైలిష్ కి కేరాఫ్ అడ్రస్. ఖుషి సాంగ్ లో ఆమె కాస్ట్యూమ్స్ అన్ని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండడం విశేషం.

సాంగ్ కూడా ఆహ్లాదంగా హీరోయిన్ పై తన ప్రేమను వ్యక్తం చేసే విధంగా మేల్ వెర్షన్ లో ఉంది. ఇక సాంగ్ లో టర్కీ బ్యాక్ డ్రాప్ లో లొకేషన్స్ కూడా అద్భుతంగా కాన్సెప్ట్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నాయి. సమంత ఆ కాస్ట్యూమ్స్ లో గార్జియస్ గా ఉందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ స్టయిలింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే.

ఈ టైటిల్ సాంగ్ లో సమంత విజయ్ దేవరకొండ జోడి కూడా చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ హాసమ్ అబ్దుల్ వాహబ్ ఈ టైటిల్ సాంగ్ ని ఆలపించారు. అతని వాయిస్ కూడా రిఫ్రెష్ గా ఉంది. ఈ సినిమాతోనే వాహబ్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఖుషిలో ఫస్ట్ సాంగ్ రేంజ్ లో ఈ పాటకూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.