ఖుషీ దెబ్బకు కాస్మో కవర్ చినిగిందిగా
సూటిగా కళ్లలోకి చూడకండి! కాస్మిక్ రేస్ దూసుకెళతాయి.. ఆపై బర్న్ అవుతారు! అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాలి.
By: Tupaki Desk | 18 Dec 2023 9:08 AM GMTసూటిగా కళ్లలోకి చూడకండి! కాస్మిక్ రేస్ దూసుకెళతాయి.. ఆపై బర్న్ అవుతారు! అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇది అబ్బాయిలకు స్టాట్యుటరీ వార్నింగ్. కపూర్ గాళ్ కళ్లలోని చురుకైన కాస్మిక్ రేస్.. మత్తైన జిగిబిగి అందాలు బోయ్స్ ని చిత్తు చేస్తాయి. చూస్తుండగానే అక్క జాన్వీకపూర్ కే పోటీకొస్తోంది ఖుషీ కపూర్. ఇన్నాళ్లు జాన్వీ గురించి మాట్లాడిన వారంతా ఇప్పుడు ఖుషీ గురించి మాట్లాడాల్సి వస్తోంది. గ్లామర్ వరల్డ్ ని షేక్ చేయడానికి ఇటీవలే ది ఆర్చీస్ తో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ చకచకా వరుస చిత్రాలకు సంతకాలు చేస్తోంది.
ఇక పబ్లిక్ ఈవెంట్లలో హెడ్ టర్నర్ గా నిలిచే ఖుషీ కపూర్ ఇప్పుడు పాపులర్ మ్యాగజైన్ కాస్మోపాలిటన్ కవర్ పేజీపై గుబులు రేపింది. తన ఎత్తుకు తగ్గట్టుగా సీక్విన్ కార్సెట్ టాప్‌లో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. పాక్షికంగా అందాలను ఎలివేట్ చేసే మెస్సీ(జల్లెడ) దుస్తుల్లో మైండ్ బ్లాక్ చేసింది ఖుషీ. ఈ లుక్ మడోన్నా, ఏంజెలినా లాంటి డస్కీ అందాలకు తక్కువేమీ కాదు! అంటూ ఇప్పుడు అబ్బాయిలు కామెంట్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఖుషీ నటించిన తొలి వెబ్ చిత్రం `ది ఆర్చీస్` ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో బెట్టీ పాత్రకు మంచి సమీక్షలను అందుకుంది. సుహానా ఖాన్ - అగస్త్య నందా లాంటి నటవారసులతో కలిసి ఖుషీ స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేస్కుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఖుషీ అక్క జాన్వి కపూర్ నెట్‌ఫ్లిక్స్ చిత్రంపై తన ఆలోచనలను షేర్ చేస్కుంది. ఖుషీని ప్రశంసిస్తూనే తనవంతుగా కొన్ని సలహాలు ఇచ్చింది.
ది ఆర్చీస్ వీక్షించాక సోదరి జాన్వీ కపూర్ ఖుషీపై ప్రశంసలు కురిపించింది. ``ఖుషి నిజాయితీగా చాలా అద్భుతంగా చేసింది. నేను తనతో మాట్లాడేప్పుడు పోటీకి సిద్ధంగా ఉండమని.. అయితే ఆ ప్రక్రియలో తనను తాను మరచిపోవద్దని చెప్పాను. ఎవరైనా మీ గురించి చెడుగా చెప్పినప్పుడు, ఆ వ్యక్తిని నమ్మడం సులువు. సరైనది చెప్పే వ్యక్తిని నమ్మడానికి చాలా ఆత్మవిశ్వాసం అవసరం. నేను నా సోదరి కొన్నిసార్లు మాలో మేం చాలా ప్రశ్నించుకుంటాము. నిన్ను నువ్వు కోల్పోకు.. చాలా నిజాయితీగా ఉన్నందున బెంగపడకు`` అని చెబుతాను. ది ఆర్చీస్ లో ఖుషీ నటన చాలా హత్తుకుంది. అందులో చాలా అమాయకత్వం ఉంది. అది తప్ప ఇంకేమీ చూపించడానికి ప్రయత్నించలేదు. కెమెరా ముందు ఇది నిజం కావడం చాలా కష్టం`` అని జాన్వీ తెలిపింది.
తాను ప్రతిరోజూ ఖుషీకి సలహాలు ఇస్తుంటానని, ఈపాటికి తన మాటలు విని విసిగిపోయి ఉండవచ్చునని జాన్వీ అంది. నా సోదరి నాకంటే తెలివిగలదని కూడా నేను భావిస్తున్నాను. నేను తెరంగేట్రం చేసినప్పుడు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. తల లేని కోడిలా మారాను. నా తల్లి (శ్రీదేవి) నుండి నేను వెతికిన ధ్రువీకరణ నాకు రాలేదు. కనీసం ప్రేక్షకుల నుండి దాని కోసం వెతకడం ప్రారంభించాను. నాపై నేను చాలా ఒత్తిడి తెచ్చాను. ఇది వాణిజ్యపరంగా విజయం సాధించిన ధడక్ చిత్రంతో కొన్ని సాధ్యమయ్యాయి. కానీ సోషల్ మీడియా కబుర్లు నాపై చాలా ఉన్నాయి. తరువాతి ఐదేళ్లలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది అభద్రతాభావం నుండి పుట్టిన నిర్ణయం. మెల్లగా, నేను నా తల్లి కూతురిననే చర్చ నుండి తప్పించుకోవడం ప్రారంభించాను``అని జాన్వీ తెలిపింది. ఖుషీ కపూర్ తదుపరి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ చిత్రంలో కథానాయికగా నటించనుంది.