కియారా అవసరం లేదని ముందే డిసైడ్ అయ్యారా!
`గేమ్ ఛేంజర్` ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ కియారా అద్వాణీ ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ లో లేదు.
By: Tupaki Desk | 5 Jan 2025 7:30 PM GMT`గేమ్ ఛేంజర్` ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ కియారా అద్వాణీ ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ లో లేదు. నిన్నటి రోజున రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ప్రత్యక్షమైంది లేదు. మరి కియారా ఎందుకు ఇలా చేస్తుంది? అంటే అమ్మడి తప్పు ఎక్కడా లేనట్లే ఉంది. మేకర్సే కియారాని తన పనులు చూసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓ స్టార్ హీరో సరసన హీరోయిన్ నటిచందంటే రిలీజ్ వరకూ తప్పక అన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్, ఇంటర్వ్యూలు ఇలా ఎన్ని వీలైతే అన్నింటా తప్పక హాజరు అవ్వాల్సిందే. కాదు కూడదు అంటూ మేకర్స్ ఒప్పుకోరు. ఈ విషయంలో కేవలం నయనతార మాట మాత్రమే చెల్లుతుంది. మిగతా ఏ హీరోయిన్ మాట మేకర్స్ వినరు. అయితే ఇక్కడ కియారా పరిస్థితి వేరు. `గేమ్ ఛేంజర్` ప్రచారం కోసం రామ్ చరణ్-శంకర్ ఉంటే చాలు అనుకున్నారు. అందుకే అమెరికా ఈవెంట్ లో వీళ్లిద్దరితో పాటు సుకుమార్ , బుచ్చిబాబు వచ్చారు.
ఆ నలుగురితో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక రాజమండ్రి ఈవెంట్ లో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్ గాహాజరయ్యారు. వాళ్ల పక్కనే శంకర్, రామ్ చరణ్ ఉన్నారు. ఈ ముగ్గురు ఒకే వేదికపై ఉంటే హీరోయిన్ తో పనే ముంది అందుకే ఇక్కడ కూడా కియారా కనిపించలేదు. కోట్ల పబ్లిసిటీ ఆ ముగ్గురి రూపంలోనే దక్కుతుంది. మళ్లీ కియారాని తీసుకురావాలంటే? స్పైషల్ ప్లైట్ వేయాలి. స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయాలి.
అదనంగా పారితోషికం డిమాండ్ చేస్తే చెల్లించాలి. ఈ కథ అంతా ఎందుకని రాజుగారు అనుకున్నారో? ఏమో! ప్రచారం విషయంలో కియారాని పూర్తిగా పక్కన బెట్టేసారు. సినిమా రిలీజ్ కి మరో ఐదు రోజులు సమయం ఉంది. మరి ఈ గ్యాప్ లో కియారా ఇంటర్వ్యూలు ఏవైనా ప్లాన్ చేస్తున్నారా? అన్నది తెలియాలి.