గేమ్ ఛేంజర్ డోప్.. కియారా హార్డ్ వర్క్ కు తగ్గట్లు రిజల్ట్!
తాజాగా డోప్ సాంగ్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేశారు. అందులో సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో క్లియర్ గా తెలుస్తోంది. చాలా హార్డ్ వర్క్ చేసినట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 23 Dec 2024 11:24 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. మరోసారి గేమ్ ఛేంజర్ సినిమాకు గాను స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ.. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీలో తెలుగమ్మాయి అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొనగా.. రోజురోజుకు మేకర్స్ పెంచుతున్నారు. వరుస అప్డేట్స్ తో అలరిస్తున్నారు.
సినిమా నుంచి రా మచ్చా, నానా హైరానా, జరగండి సాంగ్స్ ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు. చార్ట్ బస్టర్స్ గా నిలిచిన ఆ పాటలు.. మ్యూజిక్ లవర్స్ ను తెగ మెప్పించాయి. రీసెంట్ గా అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫోర్త్ సింగిల్ డోప్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డోప్ సాంగ్.. అందరినీ అలరిస్తూ దూసుకుపోతోంది.
అయితే సాంగ్ లో రామ్ చరణ్ తో సమానంగా కియారా స్టెప్పులు వేసి మెప్పించారు. వేరే లెవెల్ లో ఆకట్టుకున్నారు. తన ఎనర్జీ ఏమిటో ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా డోప్ సాంగ్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేశారు. అందులో సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో క్లియర్ గా తెలుస్తోంది. చాలా హార్డ్ వర్క్ చేసినట్లు కనిపిస్తోంది.
డోప్ సాంగ్ షూటింగ్ 13 రోజులు జరిగిందని తెలిపారు కియారా. ఆ పాట షూట్ తో మూవీ చిత్రీకరణ మొదలు పెట్టినట్లు చెప్పారు. డిస్నీ ల్యాండ్ లో ఉన్నట్లు అనిపించేలా సెట్ లో 13 రోజుల పాటు సినిమా పాటను చిత్రీకరించడం తన కెరీర్ లో ఇదే మొదటి సారిని తెలిపారు. సాంగ్ ను కంపోజ్ చేసిన జానీ మాస్టర్ పై ప్రశంసలు కురిపించారు.
"సాంగ్ అంతా కొత్త స్టైల్ డ్యాన్స్ తో ఉంటుంది. అది డబ్ స్టెప్/క్లాసికల్/రోబోటిక్/హిప్ హాప్ లో ఏది అనేది కామెంట్స్ లో చెప్పండి. చాలా ప్రతిభావంతులైన, నాకు తెలిసిన అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరైన చరణ్ తో స్టెప్పులు వేయడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది. తమన్ ప్రత్యేకమైన బీట్ అందించడంతో మేం అదరగొట్టేశాం " అంటూ రాసుకొచ్చారు.
డోప్ సాంగ్ కోసం టీమ్ అంతా అద్భుతంగా పని చేసిందని తెలిపారు కియారా. పాట కోసం స్పెషల్ పర్సన్స్ తో వర్క్ చేశానని చెప్పారు. మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్, మెహకా ఒబెరాయ్ మేకప్ అదిరిపోయిందని పేర్కొన్నారు. సినిమా నుంచి మరిన్ని బిట్స్ ను త్వరలో షేర్ చేస్తానని తెలిపారు. మొత్తానికి కియారా ప్రాక్టీస్ వీడియో వైరల్ గా మారగా.. ఆమె కష్టానికి తగ్గట్లు సాంగ్ హిట్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు.