#డాన్ 3.. ఫ్రెగ్నెన్సీ కారణంగా కియరా ఔట్
బాలీవుడ్, టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది కియరా అద్వాణీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
By: Tupaki Desk | 6 March 2025 9:01 AM ISTబాలీవుడ్, టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది కియరా అద్వాణీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. వార్ 2, టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో కియరా నటిస్తోంది. రణ్ వీర్ డాన్ 3లోను నటించాల్సి ఉంది. ధూమ్ 4, శక్తి షాలిని లాంటి సినిమాల్లోను కియరా కథానాయికగా నటిస్తుందని కథనాలొస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా- కియరా జంట తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కియారా ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శారీరక శ్రమను వదులుకుంటోంది. దీని ఫలితంగా ఫర్హాన్ అక్తర్ `డాన్ 3` నుండి స్నేహపూర్వకంగా నిష్క్రమించింది. చిత్రనిర్మాతలు ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు.. వార్ 2, టాక్సిక్ చిత్రాలకు సంబంధించిన పెండింగ్ చిత్రీకరణను త్వరగా పూర్తి చేయాలని కియరా నిర్ణయించుకుంది. బ్రేక్ తీసుకునే ముందు ఈ భారీ చిత్రాలను పూర్తి చేయాలని కియరా భావిస్తోంది. అయితే 2026లో ప్రారంభమయ్యే ధూమ్ 4, శక్తి షాలిని లాంటి నెక్ట్స్ లెవల్ చిత్రాల్లోను కియరా నటించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. తదుపరి పెద్ద నిర్ణయం ఏమిటన్నది అభిమానులలో ఉత్సుకతను రేకెత్తిస్తోంది.
2023 ఫిబ్రవరిలో కియారా - సిద్ధార్థ్ జంటకు వివాహమైంది. కియరా గర్భధారణ ప్రకటన అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. కియరా మామ్ కాబోతున్న శుభసందర్భంపై నెటిజనులలో ఉత్సాహం కనిపించింది. తొలి సంతానం తర్వాత, కొంత గ్యాప్ అనంతరం తిరిగి సినిమాల్లో నటిస్తుందని భావిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ #డాన్ 3లో కియరా స్థానాన్ని రీప్లేస్ చేసేది ఎవరు? అన్నది వేచి చూడాలి. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.