Begin typing your search above and press return to search.

ఆ ఛాన్స్ కోసం జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌య‌త్నాలా!

`డాన్ `సీరిస్ లో భాగంగా `డాన్ -3` రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా ప‌ర్హాన్ అక్త‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది.

By:  Tupaki Desk   |   7 March 2025 11:43 AM IST
ఆ ఛాన్స్ కోసం జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌య‌త్నాలా!
X

`డాన్ `సీరిస్ లో భాగంగా `డాన్ -3` రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా ప‌ర్హాన్ అక్త‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాణీ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో ఫేమ‌స్ బ్యూటీలంద‌ర్నీ ప‌రిశీలించి మ‌రీ చివ‌రిగా కియారాను ఎంపిక చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి కియారా త‌ప్పుకుంది. కియారా గ‌ర్భం దాల్చ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లై ఉంటే పూర్తి చేసేది. ఎలాగూ `వార్ 2`, `టాక్సిక్` లో న‌టిస్తోంది. వాటితో పాటు ఈ సినిమా కూడా పూర్తి చేసేది. కానీ గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో `డాన్ 3` మొద‌ల‌య్యే స‌మ‌యానికి నెల‌లు కూడా నిండే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే కియారా ముందుగానే ఎగ్జిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ ఛాన్స్ కోసం జాతీయ్య ఉత్త‌మ న‌టి కృతిస‌న‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌ర్హాన్ అక్త‌ర్ కు అమ్మ‌డు ట‌చ్ లోకి వెళ్లింది.

తాను న‌టించాలి అనుకుంటోన్న విష‌యాన్ని చెప్పిందిట‌. అయితే ప‌ర్హాన్ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌లేదుట‌. మ‌రి ఈ ప్రాజెక్ట్ లో భాగ‌మ‌వ్వాలంటే? ప‌ర్హాన్ తే తుది నిర్ణ‌యం. హీరోయిన్ల విష‌యంలో ర‌ణ‌వీర్ సింగ్ క‌ల్పించుకోడు. డైరెక్ట‌ర్ ఎంపిక మేర‌కే వ‌దిలేస్తాడు. ఆయ‌న తొలి సినిమా నుంచి ఇదే విధానంలో ర‌ణ‌వీర్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. సాధార‌ణంగా హీరోయిన్ విష‌యంలో హీరోలు ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.

వాళ్లు సూచించిన హీరోయ‌న్ల‌నే తీసుకోవాల‌నే ఒత్తిడి ఉంటుంది బాలీవుడ్ లో. కానీ ర‌ణ‌వీర్ సింగ్ తో సినిమా చేస్తే డైరెక్ట‌ర్కి ఆ రక‌మైన ఇబ్బంది ఉండ‌దంటారు మేక‌ర్స్. మరి ఈ నేప‌థ్యంలో హీరోయిన్ చాన్స్ కృతిస‌న‌న్ కి వ‌రిస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం కృతి స‌న‌న్ `తేరే ఇష్క్ మే` లో ధ‌నుష్ కి జోడీగా న‌టిస్తోంది. `మిమీ` సినిమాకు గాను కృతికి 2022లో జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు వ‌రించిన సంగ‌తి తెలిసిందే.