Begin typing your search above and press return to search.

వార్ 2 లో ఆ డోస్ కూడా ఎక్కువేనా..?

ఈమధ్య బాలీవుడ్ లో తన దూకుడు తగ్గించిన కియరా అద్వాని రాబోతున్న సినిమాలతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2024 4:30 PM GMT
వార్ 2 లో ఆ డోస్ కూడా ఎక్కువేనా..?
X

RRR తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఓ పక్క దేవర సినిమా చేస్తూనే మరోపక్క హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాకు సైన్ చేశాడు. ఐతే దేవర పార్ట్ 1 రిలీజై రికార్డులు సృష్టించింది. ఇక రావాల్సింది వార్ 2నే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయనున్నాడు తారక్.

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో హృతిక్ రొషన్ కి సూపర్ కాంపిటీషన్ ఇస్తున్నాడట ఎన్ టీ ఆర్. సినిమాలో ఇద్దరు నువ్వా నేనా అనే రేంజ్ లో ఇద్దరు నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే తారక్ కి భారీ ఎలివేషన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో గ్లామర్ పరంగా కూడా అదరగొట్టేలా కియరా అద్వాని ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో ఆమె ఎవరికి జోడీ అన్నది ఇంకా రివీల్ చేయలేదు కానీ.. కియరా వార్ 2 లో గ్లామర్ డోస్ ఒక రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు.

ఈమధ్య బాలీవుడ్ లో తన దూకుడు తగ్గించిన కియరా అద్వాని రాబోతున్న సినిమాలతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. కియరా అద్వాని రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ లో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో కూడా ఆమె గ్లామర్ షో ఎట్రాక్షన్ కాబోతుందని అంటున్నారు. గేమ్ ఛేంజర్, వార్ 2 ఈ రెండు సినిమాలు అమ్మడికి లక్ కానున్నాయి.

ఈ సినిమాలే కాదు కియరా కె.జి.ఎఫ్ యశ్ టాక్సిక్ లో కూడా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాక్సిమం 2025 లోనే రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. సో ఈ లెక్కన అమ్మడు నెక్స్ట్ ఇయర్ టాప్ లేపబోతుందని అర్ధమవుతుంది. కియరా అద్వాని ఫాం లోకి వస్తే మాత్రం మిగతా హీరోయిన్స్ కు బ్యాడ్ టైం మొదలైనట్టే అని చెప్పొచ్చు. ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కు పరిచయం ఉన్న కియరా ఇక్కడ కూడా పాన్ ఇండియా సినిమాలతో పాగా వేయాలని చూస్తుంది.

ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న వారిలో కియరా ఒకరు. సో అవకాశాలతో పాటు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కూడా పడ్డాయంటే మాత్రం అమ్మడికి ఇక తిరిగు ఉండదని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత తన దూకుడు తగ్గించిందని అనిపించిన కియరా నెక్స్ట్ ఇయర్ వరుస సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.