అక్కడ ఇక్కడ కియారాకి కష్ట కాలం..!
బాలీవుడ్ లో మొన్నటిదాకా ఒక రేంజ్ లో దూసుకు పోయిన అందాల భామ కియరా అద్వాని ఇప్పుడు సడెన్ గా వెనకబడిపోయింది.
By: Tupaki Desk | 27 Jan 2025 1:30 AM GMTబాలీవుడ్ లో మొన్నటిదాకా ఒక రేంజ్ లో దూసుకు పోయిన అందాల భామ కియరా అద్వాని ఇప్పుడు సడెన్ గా వెనకబడిపోయింది. అమ్మడి కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి రీజన్ ఏంటన్నది పక్కన పెడితే చేసిన సినిమాలు కూడా సరైన సక్సెస్ అందుకోకపోవడం వల్ల డల్ అయ్యింది. 2023 లో సత్య ప్రేం కి కథ సినిమాతో అలరించిన కియరా లాస్ట్ ఇయర్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ఈ ఇయర్ మొదట్లోనే రాం చరణ్ తో గేం ఛేంజర్ సినిమా తో వచ్చినా ఆ సినిమా వల్ల ఆశించిన క్రేజ్ తెచ్చుకోలేదు.
రాం చరణ్ తో ఆల్రెడీ వినయ విధేయ రామ సినిమా చేసిన కియరా ఆ సినిమా కూడా ఫెయిల్యూర్ అందుకోగా గేమ్ ఛేంజర్ అయినా కాపాడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే ఇంకేముంది సూపర్ హిట్ పక్కా అనుకున్న కియరాకి ఫలితం డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి. గేమ్ ఛేంజర్ మీద ఫోకస్ చేస్తూ వచ్చిన ఒకటి రెండు బాలీవుడ్ ఆఫర్లను కాదనేసింది అమ్మడు.
కియరా అద్వాని ప్రస్తుతం యష్ తో టాక్సిక్ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాతో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న వార్ 2 లో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాల మీద అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. కె.జి.ఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కాబట్టి టాక్సిక్ మీద భారీ హైప్ ఉంది. ఇక వార్ 2 గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రెండు భారీ సినిమాలే కాబట్టి కచ్చితంగా కియరాకి కాస్త లక్ ఫేవర్ చేస్తే మాత్రం మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చినట్టే లెక్క. ఐతే ఆ సినిమాల రిజల్ట్ మీదే కియరా కెరీర్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అందం అభినయం రెండిటితో అలరించే కియరా తన వరకు సినిమాలకు బెస్ట్ ఎఫర్ట్ పెడుతున్నా ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. కియరా బేబీ తిరిగి హిట్ ఫాం ఎక్కాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. నెక్స్ట్ రాబోయే రెండు సినిమాల్లో ఒకటి సౌత్ సినిమా ఒకటి బాలీవుడ్ సినిమా కాబట్టి ఏ ఒక్కటి హిట్ పడినా కియరా సత్తా చాటే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.