Begin typing your search above and press return to search.

ఈ సందేహాల‌పై కియారా క్లారిటీ ఇచ్చేసింది!

తాజాగా కియారా అద్వానీ ఇటీవల దినేష్ విజన్ కార్యాలయంలో కనిపించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:50 AM GMT
ఈ సందేహాల‌పై కియారా క్లారిటీ ఇచ్చేసింది!
X

`మూంజ్య‌`, `స్త్రీ-2` లాంటి భారీ విజ‌యాల‌తో మ‌డాక్ ఫిల్మ్స్ బాలీవుడ్ లో సంచ‌ల‌న నిర్మాణ సంస్థ‌గా మారిపోయింది. ఈ రెండు విజ‌యాల‌తో కంటెంట్ బేస్ట్ చిత్రాలు నిర్మించ‌డంలో మ‌డాక్ యూనిక్ సంస్థ‌గా హైలైట్ అయింది. దీంతో ఇప్పుడు హీరోయిన్ల అంద‌రి చూపు ఆసంస్థ‌పైనే పండింది. స‌ద‌రు నిర్మాణ సంస్థ‌లో ఛాన్స్ వ‌స్తే ముందుగా ఎస్ చెప్పిన త‌ర్వాతే స్టోరీ వినాలని డిసైడ్ అయిపోతున్నారు. తాజాగా కియారా అద్వానీ ఇటీవల దినేష్ విజన్ కార్యాలయంలో కనిపించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

దీంతో ఇది ప్రెండ్లీ మీట్ నా? లేక ప్రాజెక్ట్ కోసం ఇలా భేటీ అయ్యారా? అన్న డిస్క‌ష‌న్ నెట్టింట సాగింది. అయితే తాజాగా ఈ సందేహాల‌పై కియారా క్లారిటీ ఇచ్చేసింది. ఇద్ద‌రు క‌లిసి ఒక ప్రాజెక్ట్ చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపింది. ఓ కొత్త ఫాంట‌సీ సినిమా కోసం ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. అయితే ఇది సూపర్ నేచురల్ యూనివర్స్‌లో భాగం కాదని సహకార ప్రాజెక్ట్ చెప్పుకొచ్చింది. `స్త్రీ-2` రిలీజ్ కంటే ముందుగానే ఇరువురి మ‌ధ్య ఈ రక‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు అంత‌ర్గ‌త వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ఈ చిత్రం భిన్నమైన కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతుంది. ఇది ఓ కొత్త ఫ్రాంచైజీకి నాంది పలికేలా ఉంటుందిట‌. అతీంద్రీయ‌ అంశాలతో పాటు ఫాంటసీ కామెడీని మిళితం చేసిన కాన్సెప్ట్ అని స‌మాచారం. స్క్రిప్ట్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారుఏట‌. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ప్ర‌స్తుతం కియారా న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో `గేమ్ ఛేంజ‌ర్` లో న‌టిస్తోంది. చ‌ర‌ణ్ తో చేస్తోన్న రెండ‌వ చిత్ర‌మిది. అంత‌కు ముందు విన‌య విధేయ రామ‌లో న‌టించింది. ఆ సినిమా ప్లాప్ అయింది. అయినా ప్లాప్ తో సంబంధం లేకుండా శంక‌ర్ ఆమెని తీసుకున్నాడు. అలాగే య‌శ్ రాజ్ ఫిలింస్ లో స్పై యూనివర్స్‌లో భాగమైన `వార్ 2`లోనూ కియారా న‌టిస్తోంది.