Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్లో షో స్టాప‌ర్ ఈమె

అయితే ఈ వేదిక వ‌ద్ద‌ కియ‌రా అద్వాణీ డిజైన‌ర్ లుక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కియ‌రా వైట్ అండ్ వైట్ ఆఫ్ షోల్డ‌ర్ ఫ్రాక్ లో గ్లామ‌ర‌స్ గా త‌యారై క‌నిపించింది.

By:  Tupaki Desk   |   9 Nov 2024 5:21 PM GMT
గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్లో షో స్టాప‌ర్ ఈమె
X

రామ్ చరణ్ - కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన గేమ్ ఛేంజర్ 2025లో మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి చిత్రంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఈరోజు మేకర్స్ విడుదల చేసారు. లక్నోలో జరిగిన గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, కియారా, నిర్మాత దిల్ రాజు ఇత‌ర‌ చిత్ర బృందం హాజరయ్యారు. టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో కియారా సినిమా టీజర్ నుండి రామ్ చరణ్ చెప్పే ట్రెండీ డైలాగ్ ను చెప్పింది. 'నేను ఊహించలేను' అంటూ కియ‌రా చేతిని సిగ్నేచ‌ర్ ఫోజ్ లో తిప్పుతూ మెభిమానులను ఉత్సాహపరిచింది.

వేదిక వ‌ద్ద భారీగా గుమిగూడిన‌ ప్రేక్షకులతో గేమ్ ఛేంజ‌ర్ టీమ్ స‌ర‌దాగా సంభాషించింది. కియారాను తన చిత్రం షేర్షా నుండి ఒక డైలాగ్ చెప్పమని ప్ర‌శ్నించ‌గా, దానికి బదులుగా కియారా గేమ్ ఛేంజర్ నుండి రామ్ చరణ్ డైలాగ్ ని చెప్పింది. కియ‌రా మాట్లాడుతూ, ''ఈ రోజు మనమంతా చెబుతున్న ఏకైక డైలాగ్ 'మేమంతా ఊహించలేము' అని డైలాగ్ చెప్పింది. టీజ‌ర్ ముగింపులో వ‌చ్చే ఈ డైలాగ్ ని కియ‌రా బాగానే ఒడిసిప‌ట్టింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కియారా అద్వానీ -రామ్ చరణ్ స్మాషింగ్ ఎంట్రీ ఇవ్వ‌గా, చ‌ర‌ణ్ స్వామి అయ్య‌ప్ప మాల‌ధార‌ణ‌తో క‌నిపించారు. రామ్ చరణ్ నలుపు రంగు కుర్తా-పైజామాను ధరించారు.

అయితే ఈ వేదిక వ‌ద్ద‌ కియ‌రా అద్వాణీ డిజైన‌ర్ లుక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కియ‌రా వైట్ అండ్ వైట్ ఆఫ్ షోల్డ‌ర్ ఫ్రాక్ లో గ్లామ‌ర‌స్ గా త‌యారై క‌నిపించింది. మ‌ఖ్యంగా కియ‌రా త‌న‌లోని బోల్డ్ యాంగిల్ ని మ‌రింత స్ప‌ష్ఠంగా ఆవిష్క‌రించింద‌నే చెప్పాలి. కియ‌రా .. సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను పెళ్లాడిన త‌ర్వాత హైద‌రాబాద్ లో కీల‌క‌మైన విజిట్ ఇది. మెగాభిమానులు ఫుల్ జోష్ తో కియ‌రాకు విషెస్ తెలిపారు. ఇక కియ‌రాతో పాటు ఇత‌ర చిత్ర‌బృందానికి చెందిన ఫోటోలు కూడా ఇప్ప‌టికే నెట్ లోకి వచ్చాయి.

ఈ చిత్రంలో SJ సూర్య, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాసర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది మొదట క్రిస్మస్ 2024 కి విడుదల కావాల్సి ఉండ‌గా, 10 జనవరి 2025కి వాయిదా ప‌డింది.