కియారా ప్రెగ్నెన్సీ వల్ల ఆ సినిమాలకు ఎఫెక్ట్?
కియారా ప్రెగ్నెన్సీ వార్త విన్న కొందరు ఆమె తర్వాతి సినిమాల పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారు.
By: Tupaki Desk | 2 March 2025 6:00 AM ISTబాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కంగ్రాట్యులేషన్స్ చెప్తూ విష్ చేస్తున్నారు. కియారా ప్రెగ్నెన్సీ వార్త విన్న కొందరు ఆమె తర్వాతి సినిమాల పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం కియారా చేతిలో యష్ టాక్సిక్ తో పాటూ, హృతిక్ రోషన్ వార్2 ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పైనే ఉన్నాయి. వార్2 లో కియారా పార్ట్ షూటింగ్ దాదాపు అయిపోయుండొచ్చు. మరి టాక్సిక్ పరిస్థితేంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ సినిమా షూటింగ్ ఆఖరి స్థాయికి రాలేదు కాబట్టి కియారా పోర్షన్ షూటింగ్ అప్పుడే అయిపోయిందనుకునే ఛాన్స్ లేదు.
ఈ నేపథ్యంలో టాక్సిక్ లో బ్యాలెన్స్ ఉన్న తన పోర్షన్ షూటింగ్ ను కియారా ఈ రెండు నెలల్లోనే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పొట్టతో కుదరదు కాబట్టి ఈ లోపు కియారా టాక్సిక్ ను ఫినిష్ చేసేయాలి. ఎంతోమంది హీరోయిన్లు ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి కియారా కూడా అలానే ప్లాన్ చేసుకుని ఉండే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తుంది. ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుండగా, నయనతార ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వారితో పాటూ హుమా ఖురేషి, తారా సుతారియా తో లాంటి పలువురు స్టార్ నటులు టాక్సిక్ లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే కియారా అద్వానీ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్3 సినిమా నుంచి బయటకు రావాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో పాటూ కియారా ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్ సినిమాలో కూడా కనిపించనుందని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు కియారా ప్రెగ్నెన్సీ వార్త విన్నాక అది కుదిరే పని కాదని తేలిపోయింది.