Begin typing your search above and press return to search.

కండీషన్స్ అప్లై అంటుంది కియరా అద్వాని..!

ఆమె చేస్తున్న సినిమాలు అందుకుంటున్న ప్రశంసలు వరుస ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   21 May 2024 5:29 AM GMT
కండీషన్స్ అప్లై అంటుంది కియరా అద్వాని..!
X

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బ్యూటీ కియరా అద్వాని. ఆమె చేస్తున్న సినిమాలు అందుకుంటున్న ప్రశంసలు వరుస ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాయి. సినిమాలు వెబ్ సీరీస్ లు ఇలా కెరీర్ మొదట్లో ఏ ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేస్తూ సత్తా చాటిన కియరా అద్వాని ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. అంతేకాదు ఎంతో లక్ ఉంటేనే గానీ రాని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఛాన్స్ ఈ ఏడాది అందుకుంది కియరా. కేన్స్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉమెన్ ఇన్ సినిమా విభాగంలో చర్చలు కియరా ఇండియా తరపున ఆహ్వానం అందుకుంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న కియరా తన అనుభవాన్ని పంచుకున్నారు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం ఇదని ఆమె అన్నారు. చిన్నప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు వెళ్లామని కానీ ఇలా తను ఇక్కడ ఒక గెస్ట్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అంతేకాదు తన పదేళ్ల సినీ కెరీర్ గురించి కూడా మాట్లాడిన కియరా ఎలాంటి పాత్ర అయినా తను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాను అందుకే తనకు అవకాశాలు వస్తున్నాయని అంటుంది.

షేర్షా సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చేశాను. అయితే ఆ సినిమా టైం లో నేను అలాంటి సీన్స్ చేయగలనా అని కొందరు డౌట్ పడ్డారు. కానీ ఇప్పుడు తాను చేస్తున్న వార్ 2, డాన్ 3 పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలుగా వస్తున్నాయి. కెరీర్ లో లవ్, ఎంటర్టైనింగ్, యాక్షన్ ఇలా అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలని ఉందని. రాబోతున్న రెండు సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకుంటానని అంటుంది కియరా అద్వాని.

ఇక తాను సినిమా ఓకే చేయాలంటే పాత్ర చిన్నదైనా సినిమాకు అది చాలా ఇంపార్టెంట్ అయ్యుండాలని అంటుంది. ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించాలని అనుకోవడం లేదు. పదేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.. ఇక మీదట కూడా ఇలానే కష్టపడి పనిచేస్తా.. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తా అలాంటి సినిమాలకే తాను ఓకే చెబుతా అంటూ సినిమా సెలక్షన్స్ పై తన కండీషన్స్ చెబుతుంది కియరా.

కియరా అద్వాని కేవలం హిందీలోనే కాదు తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేసింది. రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ లో కియరా నటిస్తుంది. ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది అమ్మడు.