అన్నీ చేసేసి ఇప్పుడు సుద్దపూసనంటే ఎలా?
తాజాగా ఈ ఏడాదితో అమ్మడు 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ముగించుకుంది. ఈ సందర్భంగా జర్నీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 18 Jun 2024 9:30 AM GMTచేయాల్సినవన్నీ ఆరంభంలోనే చేసేసి ఇప్పుడు సుద్ద పూసనంటే ఎలా కియారా? అవును ఈ డౌట్ రావడం సహజమేగా. లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వాణీ బోల్డ్ రోల్ తో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అప్పటికే నాలుగు సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా తీసుకురాని గుర్తింపు 'లస్ట్ స్టోరీస్' తీసుకొచ్చింది. అందులో అమ్మడు విక్కీ కౌశల్ తో బెడ్ రూమ్ లో సీన్లో ఏ రేంజ్ లో చెలరేగిందో తెలిసిందే.
ఇదంతా పెళ్లైన తర్వత శోభనం రాత్రి కథ. ఇక పెళ్లికి ముందు? ముద్దు, ముచ్చట కోసం పరితపించే సన్నివేశాల్లో కుర్రకారుని ఏ రేంజ్లో కిర్రెక్కించిందో తెలిసిందే. ఓనటిగా తన ఫరది దాటి చేసిన సన్నివేశాలే అవన్నీ. ఇదంతా సినిమాలో పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి తప్పలేదు. నటిగా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయాలి కాబట్టి చేసింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రల జోలికి వెళ్లలేదు అనుకోండి.
అప్పటి నుంచి డీసెంట్ రోల్స్ తోనే మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అమ్మడు హిందీతో పాటు తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదితో అమ్మడు 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ముగించుకుంది. ఈ సందర్భంగా జర్నీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుటుంబంతో కలిసి చూసే సినిమాలు చేయడమే లక్ష్యంగా ముందుకు కదిలాను అంటోంది.
'21 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను. అప్పుడు నటిగా ఎదగాలి అనే ఆలోచన మాత్రమే ఉండేది. అప్పుడు నేను ఏం చేస్తున్నానో? ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో తెలియదు. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో కూడా అవగాహన ఉండేది కాదు. కానీ ఇప్పుడు పదేళ్ల జర్నీ ఎన్నో విషయాలు నేర్పించింది. కథలు, పాత్రల ఎంపికలో ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఫ్యామిలీ సినిమాలే చేస్తాను. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకున్నాను' అని అంది.