Begin typing your search above and press return to search.

కియారాతో మ‌రో స్టార్ హీరో రొమాన్స్!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ కోలీవుడ్ హీరోతోనూ రొమాన్స్ కి రెడీ అవుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Jun 2024 7:57 AM GMT
కియారాతో మ‌రో స్టార్ హీరో రొమాన్స్!
X

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ కోలీవుడ్ హీరోతోనూ రొమాన్స్ కి రెడీ అవుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం కియారా ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న `గేమ్ ఛేంజ‌ర్` లో న‌టిస్తోంది. అమ్మ‌డికిది తొలి పాన్ ఇండియా చిత్రం. ఇది హిట్ అయితే కియారా రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ప్రాజెక్ట్ పై అంతే కాన్పిడెంట్ తో ఉంది. అలాగే బాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తోనూ జ‌త క‌డుతుంది.

హృతిక్ రోష‌న్..ఎన్టీఆర్ న‌టిస్తోన్న `వార్ -2` లో న‌టిస్తోంది. ఇలా ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో ఛాన్సులం దుకుంది. ఇంత‌వ‌ర‌కూ ఈ రెండు సినిమాల‌పైనే దృష్టి పెట్టి ప‌నిచేసింది. బాలీవుడ్ నుంచి కొత్త అవ‌కావాలు వ‌చ్చినా కంగారు ప‌డి సైన్ చేయ‌డం లేదు. ఏ సినిమా క‌మిట్ అయినా అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందా? లేదా? అన్ని ఆలోచించుకునే సైన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా ధ‌నుష్ హీరోగా న‌టిస్తోన్న మ‌రో చిత్రానికి ఎస్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఇది కేవ‌లం బాలీవుడ్ చిత్ర‌మే. ధునుష్ క‌థానాయ‌కుడిగా ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కియారాని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారాం. కియారాకి స‌రైన టైమ్ లో మ‌రో పెద్ద అవ‌కాశం వ‌రించింద‌నే చెప్పాలి. ధ‌నుష్ తో న‌టించ‌డానికి ఎంతో భామ‌లు క్యూలో ఉన్నారు. వాళ్ల‌లో కియారా ల‌క్కీ గాళ్ల అని చెప్పాలి. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే ప్రారంభం కావాలి.

కానీ ధనుష్ డేట్లు కేటాయించ‌డంలో జాప్యం చేయ‌డంతో ప్రాజెక్ట్ డిలే అవుతుంది. అయితే ఈ డిలే నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని హిందీతో పాటు త‌మిళ్ లో కూడా చేయాలా? అన్న ఆలోచ‌న‌లోనూ ఉన్నారు. కోలీవుడ్ లో ధ‌నుష్ పెద్ద స్టార్. బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. ఈ నేప‌థ్యంలో రెండు భాష‌ల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచ‌న రాయ్ లో మొద‌లైన‌ట్లు స‌మాచారం.