స్టార్ హీరోయిన్ స్పెషల్ డిమాండ్స్.. నిజమేనా?
వాటిని చదివిన వారు కియారా అద్వానీ గురించే అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
By: Tupaki Desk | 27 May 2024 5:56 AM GMTఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై టాప్ హీరోయిన్స్ గా ఉన్నవారిలో కొంతమంది మాత్రమే పాన్ ఇండియా ఇమేజ్ తో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. 4 కోట్లకి పైగానే రెమ్యునరేషన్ గా సదరు హీరోయిన్స్ తీసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ భామలలో స్టార్ హీరోయిన్స్ గా ఉన్నవారికి ఎక్స్ ట్రా డిమాండ్స్ ఎక్కువ అయిపోతున్నాయనే ప్రచారం ప్రస్తుతం బిటౌన్ లో వినిపిస్తోంది.
ముఖ్యంగా టాప్ 5 హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న కియారా అద్వానీ తన అదనపు డిమాండ్ లతో నిర్మాతలని భయపెడుతుందనే ప్రచారం నడుస్తోంది. బాలీవుడ్ కొన్ని వెబ్ సైట్స్ నేరుగా కియారా అద్వానీ పేరు చెప్పకుండా ఆమె విలాసాల గురించి ప్రస్తావిస్తూ కథనాలు రాశారు. వాటిని చదివిన వారు కియారా అద్వానీ గురించే అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ముఖ్యంగా ఏదైనా సినిమాకి ఆమె కమిట్ అయితే విలాసవంతమైన విమాన ప్రయాణం కోరుకుంటుందంట. అలాగే వ్యక్తిగత జిమ్ ట్రైనర్ ని ముంబై నుంచి తనతో పాటు తెచ్చుకుంటుందంట. స్పెషల్ గా ప్రైవేట్ చెఫ్ ని కూడా నియమించుకొని వారి ఖర్చుని కూడా నిర్మాతల మీదనే వేస్తుందంట. ఈ అదనపు ఖర్చుల కారణంగా నిర్మాతలకి ఆమె రెమ్యునరేషన్ కాకుండా 50 నుంచి 60 లక్షల వరకు ఎక్స్ ట్రాగా ఖర్చు అవుతుందంట.
అయితే కియారా అద్వానీ మాత్రం తన అదనపు ఖర్చుల విషయంలో వెనక్కి తగ్గడం లేదనే మాట వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. గతంలో చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్స్ విషయం ఇదే రకమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీలో నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో కియారా అద్వానీ లీడింగ్ యాక్టర్ గా ఉంది. బాలీవుడ్ దర్శక నిర్మాతలు కియారాని తమ సినిమాలలో హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకుంటున్నారు. హిందీలో వార్ 2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇక టాలీవుడ్ లోనే కాకుండా అమ్మడు కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇక బాలీవుడ్ లో చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఏమాత్రం ఖాళీ లేకుండా ఉన్న కీయారా ఏడాదికి ఒక బిగ్ హిట్ చూస్తోంది. అందుకే ఆమే రేంజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.