Begin typing your search above and press return to search.

పెళ్లి త‌ర్వాత ఇస్పీడ్ గా ఆ హీరోయిన్!

బాలీవుడ్ న‌టి కియారా అద్వాణీ న‌టుడు సిద్దార్ధ్ మ‌ల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 April 2024 12:30 AM GMT
పెళ్లి త‌ర్వాత ఇస్పీడ్ గా ఆ హీరోయిన్!
X

బాలీవుడ్ న‌టి కియారా అద్వాణీ న‌టుడు సిద్దార్ధ్ మ‌ల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే స‌క్సెస్ లో దూసుకుపోతున్న అమ్మ‌డికి వివాహం మ‌రింత క‌లిసొచ్చింది. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే వివాహం జ‌రిగింది. ఆ త‌ర్వాత అమ్మ‌డు వ‌రుస‌గా కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ లు చేస్తూనే ఉంది. అప్ప‌టికే కియారా చేతిలో పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్` సెట్స్ లో ఉంది. అందులో న‌టిస్తూనే మ‌రోవైపు హిందీ సినిమాలు చేసింది. తాజాగా ఇటీవ‌లే `వార్ -2` లో కూడా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

ఇందులో అమ్మ‌డు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జోడీగా న‌టించ‌నుంది. ఆయ‌న‌తో పాటు క‌లిసి యాక్ష‌న్ స‌న్నివేశాలు చేస్తుంది. అలా `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో ఛాన్స్ అందుకున్న ల‌క్కీ గాళ్ల్ కియారా మాత్ర‌మే. ఈ విష‌యంలో అమ్మ‌డు పెట్టి పుట్టింద‌నే చెప్పాలి. జాన్వీ క‌పూర్ కూడా ఇదే కోవ‌లో క‌మిట్ అయి చ‌ర‌ణ్‌..తార‌క్ తో సినిమాలు చేస్తోంది. తాజాగా కియారా `సలార్ -2` లోనూ ఎంపికైందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఇందులో ప్ర‌భాస్ కి జోడీగా క‌నిపించ‌నుంద‌ని వినిపిస్తుంది.

శ్రుతి హాస‌న్ పాత్ర తొలి భాగంలో పెద్ద‌గా లేని నేప‌థ్యంలో ఆపాత్ర‌కి ప్రాముఖ్య‌త ఉంటూనే..మ‌రో మెయిన్ లీడ్ కి కియారాతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇవి గాక తెలుగులో మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోల‌తోనూ కాంబినేష‌న్ సెట్ అవుతున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా బ‌య‌ట‌కు రానున్నా య‌ని స‌మాచారం. అలాగ‌ని బాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. అక్క‌డ ఛాన్స్ వ‌చ్చినా నో అన‌కుండా సైన్ చేస్తుంది.

వాస్త‌వానికి కియారా రెండేళ్ల క్రితం వ‌ర‌కూ వేగంగానే సినిమాలు చేసుకుంటూ వ‌చ్చింది. గ‌త ఏడాది ఒక్క సినిమాతోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పెళ్లైన ఏడాది కావ‌డంతో గ్యాప్ అనివార్య‌మ‌వ్వ‌డంతో త‌ప్ప‌లేదు. అయితే సిద్దార్ద్ ని పెళ్లాడిన త‌ర్వాత టాలీవుడ్ లో అందులోనూ ఇక్క‌డి స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా అవ‌కాశాలు రావ‌డం విశేషం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పెళ్లి కాక ముందే `విన‌య విధేయ రామ‌`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు.