Begin typing your search above and press return to search.

చిన్న‌ప్పుడే కేన్స్ వేడుక‌ల్లో కియారా!

77 కేన్స్ ఫిల్మ్ పెస్టివ‌ల్ వేడుక‌లో కియారా అద్వాణీ మెరిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 May 2024 12:30 PM GMT
చిన్న‌ప్పుడే  కేన్స్ వేడుక‌ల్లో  కియారా!
X

77 కేన్స్ ఫిల్మ్ పెస్టివ‌ల్ వేడుక‌లో కియారా అద్వాణీ మెరిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డిజైన‌ర్ దుస్తుల్లో కేన్స్ ఉత్సవాల్లో త‌న‌దైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటుంది. అయితే అమ్మ‌డు ఈ ఉత్స‌వాల్లో పాల్గొన‌డం ఇదే తొలిసారి. బాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా కాల‌మ‌వుతోన్న పాల్గొనే అవ‌కాశం మాత్రం ఇదే ఏడాది ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో కేన్స్ తో త‌న‌కున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంది. `కేన్స్ ఉత్స‌వాల్లో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంది.

నాకు ద‌క్కిన గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. నాకెరీర్ లోనే ఎంతో మ‌ధుమైన జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం నా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఈ వేడుక‌లో పాల్గొన్నాను. అప్పుడు చిన్న పిల్ల‌ని. చిన్న‌ప్పుడు ఇలాంటి వాటి గురించి ఇంట‌ర్నెట్ ద్వారా తెలుసుకునేదాన్ని. కానీ నేను ఓ సెల‌బ్రిటీగా ఇలాంటి వేడుక‌ల్లో పాల్గొంటాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఎప్పటికీ మ‌ర్చిపోలేని ఓ జ్ఞాప‌కం. సినిమాల్లోకి రావాడం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. లేదంటే? కేన్స్ లో రెడ్ కార్పెట్ పై న‌డిచే అవ‌కాశం రాదు.

సినిమా అనేది ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు తెస్తుందో మ‌రోసారి నాకు అర్ద‌మైంది. ఇలాంటి చిత్రోత్సావాల్లో పాల్గొనే అవ‌కాశం వ‌స్తే ఇక‌పై మిస్ చేసుకోను` అని అన్నారు. ప్ర‌స్తుతం కియారా కెరీర్ బాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజ‌యాల‌తో పుల్ స్వింగ్ లో ఉంది. అలాగే టాలీవుడ్ లో `గేమ్ ఛేంజ‌ర్` లో న‌టిస్తోంది. అమ్మ‌డి కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. ఇవి గాక‌ మ‌రికొన్ని ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల్లోనూ న‌టిస్తోంది.

`వార్ -2` లో ఎన్టీఆర్ కి జోడీగా న‌టిస్తోంది. అందులో ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు..యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలైట్ కానున్నాయ‌ని స‌మాచారం. ఈ మ‌ధ్య‌నే రెండు భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. కానీ వాటి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.