Begin typing your search above and press return to search.

వివాదాల హీరోకి కియారా నో చెప్పిందా?

కోలీవుడ్ లో శింబు మ‌ళ్లీ బిజీ స్టార్ గా మారిన సంగ‌తి తెలిసిందే. కొత్త ప్రాజెక్ట్ లతో కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు

By:  Tupaki Desk   |   25 May 2024 1:30 PM GMT
వివాదాల హీరోకి కియారా నో చెప్పిందా?
X

కోలీవుడ్ లో శింబు మ‌ళ్లీ బిజీ స్టార్ గా మారిన సంగ‌తి తెలిసిందే. కొత్త ప్రాజెక్ట్ లతో కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాసన్ హీరోగా న‌టిస్తోన్న `థ‌గ్ లైఫ్` లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో శింబు పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాపై భారీ అంచాన‌లున్నాయి. ఈ సినిమా త‌ర్వాత శింబు ఇమేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంద‌నే అంచ‌నాలున్నాయి.

ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్ బ్యాన‌ర్లోనే శింబు త‌న 48వ చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కిస్తున్నాడు. దేశింగ్ పెరియ‌ర్ స్వామి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన శింబు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆద్యంత ఆస‌క్తిని క‌లిగించింది. ఇందులో శింబు డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నాడు. అయితే ఆపాత్ర‌ల‌కు హీరోయిన్లు? ఎవ‌రు అన్న‌ది కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌రంగా మారింది. హీరోయిన్ ఫైన‌ల్ కాకుండాలే శింబు లుక్ రిలీజ్ చేయ‌డంతో రెట్టింపు ఆస‌క్తి నెల‌కొంది.

ఈ నేప‌త్యంలో ఓ హీరోయిన్ విష‌యంలో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో ఓ హీరోయిన్ బాలీవుడ్ న‌టి కియారా అద్వాణీని సంప్రదించారుట‌. కానీ ఈ ఆఫ‌ర్ ని అమ్మ‌డు రిజెక్ట్ చేసిందిట‌. స్టోరీ కూడా విన‌కుండా బిజీగా ఉన్నాన‌ని స్కిప్ కొట్టిందిట‌. మ‌రి ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింద‌న్న‌ది తెలియ‌దు గానీ..ఈవార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. శింబు అంటే రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అత‌నితో న‌టించ‌డానికి హీరోయిన్లు అంతా ఎంతో ఆస‌క్తి చూపిస్తారు.

ముఖ్యంగా సౌత్ భామ‌లైతే మ‌రింత ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు. కానీ కియారా మాత్రం నోవే అనేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి రొమాంటిక్ స్టార్ తో న‌టించ‌డం ఆస‌క్తి లేక‌నా? ఇంకేవైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. శింబు డేట్లు ఇవ్వ‌గానే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిచాల‌ని చూస్తున్నారు.