Begin typing your search above and press return to search.

కియారా బ్యూటీ కేన్స్ కే కొత్త‌క‌ళ‌!

ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని లాంగ్ షార్ట్ లో క్లోజ్ లో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అభిమా నులంతా కియారా అందానికి మంత్ర‌ముగ్దుల‌వుతున్నారు.

By:  Tupaki Desk   |   18 May 2024 10:28 AM GMT
కియారా బ్యూటీ కేన్స్ కే కొత్త‌క‌ళ‌!
X

భార‌తీయ అందాల‌తో కేన్స్ ఉత్సావాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. బాలీవుడ్ భామ‌లు అంద‌చందాల‌తో ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతోన్న వైనం వావ్ అనిపిస్తుంది. రెడ్ కార్పెట్ పై ఏ భార‌తీయ న‌టి వాక్ చేసినా? ఒక్క‌సారిగా అక్క‌డో వేవ్ మొదలైపోతుంది. అంత‌గా కేన్స్ ఈవెంట్ కి బాలీవుడ్ భామ‌లు క‌నెక్ట్ అయిపోయారు. ఇప్ప‌టికే ఐశ్వ‌ర్యారాయ్, శోభిత ధూళిపాళ‌, ఊర్వ‌శి రౌతేలా లాంటి భామ‌ల హోయ‌లు చూసాం. తాజాగా కియారా అద్వాణీ కూడా కేన్స్ ఫ్యాష‌న్ ఎంపిక‌లో భాగంగా మెరిసింది.

వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో కియారాని చూడటానికి రెండు క‌ళ్ల‌వు చాల‌వు అన్నంత అందంగా ప్రొజెక్ట్ అయింది. తెలుపు రంగు స్లీవ్ లెస్ ఎంతో ప్ల‌జెంట్ గా కార్పెట్ పై వాక్ చేసింది. అమ్మ‌డు ముస్తాబైన విధానం ప్ర‌తీది కియారాని ఎంతో అద్భుతంగా హైలైట్ చేసాయి. ముఖ్యంగా కియారా చెవుల‌కు ధ‌రించిన డిజైన‌ర్ చెవులీలు మాత్రం మ‌రింత హైలైట్ అనాలి. డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ వైట్ క‌ల‌ర్ యాక్స‌ర‌సీస్ మ‌రింత బ్యూటీని యాడ్ చేసాయి.

ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని లాంగ్ షార్ట్ లో క్లోజ్ లో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అభిమా నులంతా కియారా అందానికి మంత్ర‌ముగ్దుల‌వుతున్నారు. ఓట్ ప‌ర్ కియారా అంటూ భార‌తీయులంతా ఆమెని స‌పోర్ట్ చేస్తున్నారు. మోడ్ర‌న్ గాళ్ ల్ గా కియారాకి మంచి గుర్తింపు ఉంది. ఇన్ స్టాలో అమ్మ‌డు ఎలాంటి డిజైన‌ర్ దుస్తుల్లో అల‌రిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మోడ్ర‌న్ కా బాప్ అనిపించిన సంద‌ర్భాలెన్నో.

ఇక కియారా సినిమాల విష‌యానికి వ‌స్తే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'గేమ్ ఛేంజ‌ర్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే త‌న పాత్ర‌కి సంబంధించి షూటింగ్ కూడా ముగించింద‌ని వార్త‌లొచ్చాయి. ఈసినిమా హిట్ అయితే కియారా పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది. అలాగే బాలీవుడ్ లో నూ కొన్ని ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది.