బోల్డ్ రోల్స్ తో కియారా ఆలోచనల్లో ఛేంజ్!
లస్ట్ స్టోరీస్'..'కబీర్ సింగ్' పాత్రలకు ప్రశంసలతో పాటు విమర్శలు ఎదుర్కున్నాను.
By: Tupaki Desk | 20 Oct 2023 5:28 AM GMTకియారా అద్వాణీ టాలీవుడ్..బాలీవుడ్ చిత్రాలతో బిజీ నాయికగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. హిందీ పరిశ్రమలో డై బై డే షైన్ అవుతూ దూసుకుపోతుంది. వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకతని క్రియేట్ చేసుకుంటుంది. కరీనా కపూర్..కత్రినాకైఫ్..దీపికా పదుకొణే లాంటి సీనియర్ భామలున్నా! వాళ్లతో పోటీ పడి అవకాశాలు అందుకుంటుంది. ఇక బ్యూటీ తనలో బోల్డ్ నెస్ కెరీర్ ఆరంభంలోనే నిరూపించిన సంగతి తెలిసిందే.
'లస్ట్ స్టోరీస్' లో బోల్డ్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయింది. అటుపై 'కబీర్ సింగ్' లో అంతే బోల్డ్ గా నటించి తానేంటో మరోసారి నిరూపించింది. దర్శకుల నటినని ఆరంభంలోనే చాటి చెప్పింది. అయితే ఇలా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి రోల్స్ చేయడం ఎంతో పరిణితి చెందిన అంశంగా పేర్కొంది. 'మొదట్లో కథను ఎంచుకునే విషయంలో చాలా కష్టం అనిపించేది. ఇప్పటికీ కూడా అలాగే అనిపిస్తుంది(నవ్వుతూ).
దాని ద్వారా ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాను. ఏది చేసినా కొంచెం భిన్నంగా చేయాలనే ఆలోచనతో నాకు తొచిన నిర్ణయాలు తీసుకుంటాను. 'లస్ట్ స్టోరీస్'..'కబీర్ సింగ్' పాత్రలకు ప్రశంసలతో పాటు విమర్శలు ఎదుర్కున్నాను.
కానీ ఆ పాత్రల ఎంపిక ద్వారా నాలో ఆలోచనా విధానం ఎలా ఉందని తెలిసింది. ఈ పాత్రలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి. ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అన్న దానిపై ఓ క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. పెళ్లి కాక ముందు నుంచే సిద్దార్ధ్..నేను మా బంధాన్ని కాపాడుకోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు నటీనటులుగా మాకున్న గుర్తింపును కాపాడుకోవడంపై దృష్టి పెట్టాం. సినీ రంగంలో మాకు ఓమంచి స్థానాన్ని ఏర్పరుచుకున్నాం. దీని కోసం మేము చాలా కష్టపడ్డాం. మావ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టి ప్రేక్షకుల అభిమానానికి దూరంగా ఉండాలనుకోవడం లేదు. మాపై వారికున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అంది.