Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హాట్ కియ‌రా రివీలింగ్ షో!

కియారా ఇటీవల ఒక ప్రముఖ మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం కొత్త అవతార్‌లో క‌నిపించింది. ఈ కొత్త లుక్స్ కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొట్టాయ‌ని చెప్పాలి

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:53 AM GMT
ఫోటో స్టోరి: హాట్ కియ‌రా రివీలింగ్ షో!
X

కియారా అద్వానీ యువ‌త‌రం అత్యంత ఆరాధించే న‌వ‌నాయిక‌. వేడి పెంచే అందం సొగ‌సు ఈ బోల్డ్ బోల్డ్ సొంతం. నిరంత‌రం డేరింగ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ తో గుబులు రేప‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. దానికి త‌గ్గ‌ట్టే సోష‌ల్ మీడియా పోస్టింగులు హీటెక్కిస్తూనే ఉన్నాయి.


కియారా ఇటీవల ఒక ప్రముఖ మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం కొత్త అవతార్‌లో క‌నిపించింది. ఈ కొత్త లుక్స్ కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొట్టాయ‌ని చెప్పాలి. ఈ స్పెష‌ల్ లుక్ సోషల్ మీడియాలో భారీ సంచలనానికి తెర తీసింది. కియారా అద్వానీ ఫెమినా ఫోటోషూట్ కోసం బోల్డ్ అండ్ డ‌స్కీ దుస్తులలో హొయ‌లు పోయింది.

ఫెమినా మ్యాగజైన్ ముఖచిత్రం కోసం మ్యూజ్‌గా మారిపోయిన కియ‌రా కొత్త హ్యారీకట్‌లో చాలా అందంగా కనిపించింది. సోమవారం కియారా తన IG ఖాతాలో షూట్ నుండి తన BTS క్లిప్‌ను రిలీజ్ చేయ‌గా అది క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. తన భుజం మీదుగా లూజు కర్ల్స్‌లో స్టైల్ చేసిన బ్యాంగ్స్ తో కియారా స్పెష‌ల్ గా క‌నిపించింది. ఎమరాల్డ్ గ్రీన్ వన్-షోల్డర్ స్కింపీ బ్రాలెట్‌లో చిరు అలంకారాలతో అందరినీ విస్మయానికి గురి చేసింది.

లాక్మే ఫ్యాషన్ వీక్ 4వ రోజు కియారా అద్వానీ లేటెస్ట్ డిజైన‌ర్ లుక్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఇదే వేదిక‌పై మలైకా అరోరా, రకుల్ ప్రీత్ షోస్టాపర్‌లుగా నిలిచారు. ఇంత‌లోనే కియ‌రా ఇలా ఫెమినా మ్యాగ‌జైన్ ఫోటోషూట్ నుండి అనేక ఫోటోల‌ను షేర్ చేసింది. కియ‌రా త‌న‌లోని కిల్ల‌ర్ ఊంప్ ని ప్రదర్శించింది. ఓ క్లిప్ లో కియారా ఆఫ్-వైట్ కో-ఆర్డ్ సెట్... థై స్లిట్ స్కర్ట్‌తో కెమెరాకు పోజులివ్వగా, మరొక పోస్ట్‌లో ట్యూబ్ సిల్వర్ టాప్ దానికి స‌రిప‌డే స్కర్ట్ ధరించింది.

అయితే కియరా దుస్తుల ఎంపిక‌, ఎక్స్ ప్రెష‌న్స్ ప్ర‌తిదీ ప్ర‌ముఖ క‌థానాయిక‌ను పోలి ఉండ‌డం ఆస‌క్తిక‌రం. అభిమానులు కియారా లుక్‌ని ఈషా డియోల్ లుక్స్‌తో పోల్చడం ఇంటర్నెట్‌లో హీటెక్కించింది. స్టైకింగ్ లుక్స్ తో ఈ బ్యూటీ అభిమానులను మంత్రముగ్దులను చేసింది. చాలా మంది కియ‌రాను హాట్ అండ్ స్టన్నింగ్ గాళ్ అంటూ కీర్తించారు. నెటిజనుల్లోని ఒక విభాగం 2000 చిత్రం 'ధూమ్‌'లోని ఈషా డియోల్ లుక్ తో సారూప్యత చూసారు. రెండు ఫ్రేమ్‌లలో ఆమె ఈషా డియోల్ లాగా ఉంది! అని ఒక నెటిజ‌న్ రాసారు. మరొకరు ''ఆమె నిజంగా ఈషా లాగా తన హెయిర్ క‌ట్ తో క‌నిపించింది అని వ్యాఖ్యానించారు. అంతేకాదు కొంద‌రు ..డ్రీమ్ గర్ల్ 2 చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాలా కనిపిస్తుందని కామెంట్ చేసారు. డ్రీమ్ గర్ల్ 2 'పూజ..' లాగా ఉన్నారు అని ఒకరు వ్యాఖ్యానించారు.