కియారా-అంబానీ కూతురు అంత క్లోజా?
ఇక కియారా బాలీవుడ్ కెరీర్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 28 July 2024 9:03 AM GMTబాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. 'వినయ విధేయ రామ`, `భరత్ అనే నేను` చిత్రాలతో పరిచయమైన అమ్మడికి అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీ నటిస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే అమ్మడికి పాన్ ఇండియాలో గుర్తింపు దక్కుతుంది. ఇక కియారా బాలీవుడ్ కెరీర్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
రిచ్ కిడ్ కావడంతో సినిమాల్లోకి ఈజీగా రాగలిగింది. కానీ ట్యాలెంట్తోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుందన్నది వాస్తవం. అయితే ఈ అమ్మడికి అంబానీ కుమార్తె ఈషా అంబానీచిన్న నాటి క్లోజ్ ప్రెండ్ అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఈషా అంబానీ రివీల్ చేసింది. తన జీవితంలో కియారా ఎంతో కీలకమైన వ్యక్తిగా చెప్పుకొచ్చింది.
` మంచి చెప్పే వాళ్లు మాత్రమే కాదు. విమర్శించే వాళ్లు కూడా ఉండాలి. అలా చెప్పిన వారే నిజమైన స్నేహితులు. కియారా అద్వాణీ నాకు అలాంటి స్నేహితురాలే. ఇద్దరం ముంబైలోని ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్నాం. కియారా చదువుతో పాటు ఆటల్లోనూ చురుకుగా ఉండేది. నన్ను కూడా ప్రోత్సహించేది. నచ్చని పని ఏది చేసినా వెంటనే చెప్పేది. కియారా స్కూల్ కి రాని రోజులో నాకు ఏదో కోల్పోయిన భావనలో ఉండేదాన్ని.
స్కూల్లో ఎవైనా కార్యక్రమాలు జరిగితే తనని నేను ప్రత్యేకంగా రెడీ చేసే దాన్ని. చివరికి కియారాని పెళ్లి కూతుర్ని చేసింది కూడా నేను. ఇద్దరం అంత క్లోజ్ గా ఉంటాం. నా విషయంలోనూ కియారా అంతే శ్రద్ద తీసుకుంటుంది. ఇప్పటికీ మా మద్య అలాంటి స్నేహమే కొనసాగుతుంది. తను నాకు బెస్ట్ ప్రెండ్` అని తెలిపింది.