Begin typing your search above and press return to search.

కియారా లక్కులో మరో బిగ్ హీరో!

ఇక ఇప్పుడు కియారా అద్వానీ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "టాక్సిక్" సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 May 2024 7:46 AM GMT
కియారా లక్కులో మరో బిగ్ హీరో!
X

బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇక సౌత్ లో కూడా అమ్మడు పలు పెద్ద ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటోంది. రామ్ చరణ్ సరసన ఇప్పటికే "గేమ్ చేంజర్" అనే సినిమాలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇక ఆమె ఇప్పుడు మరో దక్షిణాది సినిమాకు సైన్ చేసినట్లు టాక్ వస్తోంది.

కియారా అద్వానీ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా బిగ్ హిట్స్ అందుకోవాలని అనుకుంటోంది. "కబీర్ సింగ్", "గుడ్ న్యూస్", "లస్ట్ స్టోరీస్" వంటి హిట్ చిత్రాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అమ్మడు ఇప్పుడు సౌత్‌లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. "భరత్ అనే నేను"లో మహేష్ బాబు సరసన నటించిన కియారా ఆ తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సినిమా చేసింది. కానీ అది డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు కియారా అద్వానీ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "టాక్సిక్" సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. గీతూ మొహందాస్ ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నారు, ఇది గోవా మాఫియా నేపథ్యంలో ఉంటుందట. KVN ప్రొడక్షన్స్ యష్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు.

ఇక టాక్సిక్ సినిమాను 2025 వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించారు. "కేజీఎఫ్: ఛాప్టర్ 2" తర్వాత యష్ నటిస్తున్న తదుపరి చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ తన పాత్రను ఎంతో ఇష్టపడి, ఈ ప్రాజెక్టును సైన్ చేసినట్లు సమాచారం. ఇక యష్ సోదరి పాత్రకు నయనతారను ఎంపిక చేసినట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంపై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. షూటింగ్ ప్రారంభానికి ముందు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. కియారా అద్వానీ ఇప్పుడు హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకుంటోంది. యష్ వంటి ప్రముఖ హీరోలతో నటించడం ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. మరి "టాక్సిక్" సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.