ఈ అందం వెనుక అసలు సీక్రెట్ అదేనా..?
బాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో అక్కడ ఆడియన్స్ ని మెప్పించడమే కాకుండా టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది కియరా.
By: Tupaki Desk | 17 Jun 2024 3:51 AM GMTబాలీవుడ్ లో వరుస క్రేజీ ఆఫర్లతో అదరగొడుతున్న కియరా అద్వాని ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ప్రాజెక్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తుంది. టాలెంట్ మాత్రమే కాదు లక్ కూడా తోడైతేనే సక్సెస్ వస్తుందని ఇండస్ట్రీలో అందరు చెబుతుంటారు అది కియరా విషయంలో ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో అక్కడ ఆడియన్స్ ని మెప్పించడమే కాకుండా టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది కియరా.
తెలుగులో మహేష్, రాం చరణ్ లతో కలిసి జత కట్టిన అమ్మడు సౌత్ లో తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రాం చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఆ సినిమా తో పాటుగా బాలీవుడ్ లో మరో రెండు భారీ సినిమాలను చేజిక్కించుకుంది. హృతి రోషన్, ఎన్.టి.ఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాలో కియరా హీరోయిన్ గా ఛాన్స్ అందుకోగా.. మరో పక్క డాన్ 3 లో కూడా అమ్మడు నటిస్తుందని టాక్.
డాన్ ఫ్రాంచైజ్ లో భాగంగా డాన్ 3 సినిమా వస్తుంది. ఐతే ఈ సీక్వెల్ లో హీరోగా షారుఖ్ బదులుగా రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. రన్ వీర్ సరసన కూడా హీరోయిన్ గా కియరా ప్లేస్ దక్కించుకుంది. బాలీవుడ్ లో ఒక రేంజ్ ఫాం కొనసాగిస్తున్న కియరా తన ఫిట్ నెస్ అండ్ బ్యూటీ సీక్రెట్స్ గురించి ఇటీవల రివీల్ చేసింది. మరీ నోరు కట్టేసుకోకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే బెటర్ అనేస్తుంది అమ్మడు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీన్ ప్రొటీన్స్ తో పాటు హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే చాలని అంటుంది కియరా అద్వాని.
అంతేకాదు సరైన నిద్ర కచ్చితంగా ఉండాలని.. నిద్ర లేకపోతే డార్క్ సర్కిల్స్, ఇంకా డల్ స్కిన్ వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని అంటుంది. రోజు వర్క్ అవుట్స్ చేయడం దానితో పాటు 7 నుంచి 8 గంటలు నిద్ర కూడా తప్పనిసరి అంటుంది కియరా. ఇంత స్ట్రిక్ట్ హెల్త్ టిప్స్ ఫాలో అవుతుంది కాబట్టే కియరా అద్వాని అంత అందంగా ఉంటుందని చెప్పొచ్చు. అమ్మడి బ్యూటీ నెస్ వెనుక ఈ సీక్రెట్ తెలుసుకున్న వాళ్లంతా పాటిస్తే బెటర్ అని చెప్పొచ్చు.