Begin typing your search above and press return to search.

కియారాలో క‌సి ప‌ట్టుద‌ల క‌నిపిస్తోంది!

క‌మ‌ర్శి య‌ల్ చిత్రాల‌తో పాటు సాహ‌సోపేత‌మైన పాత్ర‌ల‌కు సైతం సై అంటోంది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 2:30 PM GMT
కియారాలో క‌సి ప‌ట్టుద‌ల క‌నిపిస్తోంది!
X

బాలీవుడ్ టూ టాలీవుడ్ కియారా అద్వానీ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు జ‌ర్నీ రెండు భాష‌ల్లోనూ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. `గేమ్ ఛేంజ‌ర్` విజ‌యం సాధిస్తే అమ్మ‌డి రేంజ్ అంత కంత‌కు రెట్టింపు అయిపోతుంది. ఇదే స‌మ‌యంలో తెలివైన నిర్ణ‌యాల‌తో ముంద‌డుగు వేస్తుంది. క‌మ‌ర్శి య‌ల్ చిత్రాల‌తో పాటు సాహ‌సోపేత‌మైన పాత్ర‌ల‌కు సైతం సై అంటోంది. వాస్త‌వానికి కియారా లో ఆ క్వాలిటీ ముందు నుంచి ఉంది.

కెరీర్ ఆరంభంలో బోల్డ్ పాత్ర‌ల‌కు సైతం సై అని బాలీవుడ్ ని షేక్ చేసింది. అది చూసి కియారాలో ఇంత తెగింపు ఉందా? అని అంతా స‌క్సెస్ త‌ర్వాత మాట్లాడుకున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌డి ఖాతాలో చాలా సినిమా లున్నాయి. ఇటీవ‌లే ప్ర‌తిష్టాత్మ‌క ప్రాంచైజీ డాన్ -3 లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో కియారా యాక్ష‌న్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన‌ట్లు అయింది. ఇంత‌వ‌ర‌కూ ఈ త‌ర‌హా పాత్ర‌లు పోషించ‌లేదు. అవ‌కాశం రాక‌పోవ‌డంతో ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఇక‌పై తానేంటో చూపిస్తానంటూ రంగంలోకి దిగుతుంది.

ఈ సంద‌ర్భంగా కియారా కెరీర్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. యాక్ష‌న్ సినిమాలు ఇంత వ‌ర‌కూ చేయ‌లేదు. ఇక ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. ప్రేక్ష‌కుల ముందుకు నాలో కొత్త కోణాన్ని తీసుకొస్తున్నా. ఓ నటి గా విభిన్న‌మైన పాత్ర‌లు చేస్తూ ..న‌టిగా నీకు అలాంటి పాత్ర‌లే స‌రైన‌వ‌ని ప్ర‌పంచం అనుకునేలా చేయాలి` అంటోంది. కియారా వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి కెరీర్ పరంగా ఆమె ఎలాంటి ఆలోచ‌న‌ల‌తో ఉందో అర్ద‌మ‌వుతుంది. న‌టిగా ఉన్నత శిఖ‌రాలు చేరాలి అన్న క‌సి ప‌ట్టుద‌ల ఆమె మాట‌ల్లో క‌నిపిస్తుంది.

`గేమ్ ఛేంజ‌ర్` లోనూ కియారా ప‌వ‌ర్ ఫుల్ రోల్ పోషిస్తుంది. అయితే ఆ పాత్ర గురించి ఎక్క‌డా రివీల్ చేయ‌డం లేదు. ఇది అమ్మ‌డికి తొలి పాన్ ఇండియా చిత్రం. శంక‌ర్ సినిమా హిట్ అయితే ఎలా ఉం టుందో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఓవ‌ర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుంది. శంక‌ర్ బ్రాండ్ తో మార్కెట్ లో తిరుగులేని ఛాన్సులు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది.