Begin typing your search above and press return to search.

కీయరా లక్కు బావుందే.. జాక్ పాట్ ఆఫర్స్

ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు పెద్ద సినిమాలలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ మల్హోత్రాని గత ఏడాది కియారా అద్వానీ పెళ్లి చేసుకుంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:01 AM GMT
కీయరా లక్కు బావుందే.. జాక్ పాట్ ఆఫర్స్
X

ధోని మూవీతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్న కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో తెలుగులో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే ఛాన్స్ అందుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ తో కియారా అద్వానీకి బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది.

గత ఏడాది సత్య ప్రేమ్ కి కథ మూవీలో కార్తిక్ ఆర్యన్ కి జోడీగా నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ బ్యూటీ తన పెర్ఫార్మెన్స్ తో విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ నటిస్తోంది. ఈ మూవీతో ఆమెకి పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు పెద్ద సినిమాలలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ మల్హోత్రాని గత ఏడాది కియారా అద్వానీ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన ఇమేజ్ ని అలాగే కొనసాగిస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వార్ 2 మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైంది. ఏప్రిల్ లో ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

తాజాగా రణవీర్ సింగ్ హీరోగా డాన్ 3 మూవీని ఎనౌన్స్ చేశారు. ఇది మాఫియా అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే సినిమానే. మొదటి, రెండు చిత్రాలలో షారుఖ్ ఖాన్ నటించారు. ఇప్పుడు ఆ స్థానంలోకి రణవీర్ సింగ్ వచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఖరారు అయ్యింది. ఇలా బాలీవుడ్ రెండు యాక్షన్ చిత్రాలలో కియారా అద్వానీ ఛాన్స్ లు అందుకోవడం

ద్వారా దీపికా పదుకునే తర్వాత ఆ స్టార్ చైర్ దిశగా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. గేమ్ చేంజర్ తో పాటు వార్ 2, డాన్3 సినిమాలు బ్లాక్ బస్టర్ పడితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కేటగిరీలోకి కియారా అద్వానీ వెళ్లిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.