Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కు ఆ స్టార్ హీరో గుడ్ బై!

అయితే తాజాగా సుదీప్ బిగ్ బాస్ హోస్టింగ్ విష‌యంలో సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇక‌పై ఈ షోకు హోస్టింగ్‌ చేయ‌న‌ని ప్ర‌క‌టించాడు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 6:30 AM GMT
బిగ్ బాస్ కు ఆ స్టార్ హీరో గుడ్ బై!
X

బిగ్ బాస్ దేశంలో చాలా భాష‌ల్లో ప్ర‌సార‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా షోని స్టార్ హీరోలే హోస్ట్ చేస్తున్నారు. తెలుగులో నాగార్జున ఫేమ‌స్ హోస్ట్ గా మారిపోయారు. ఇప్ప‌టికే కొన్ని సీజ‌న్లు హోస్ట్ చేసారు. ఇక నాగార్జున‌ను మంచి క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న 11 సీజ‌న్ల‌ను హోస్ట్ చేసి రికార్డు సృష్టించారు. సౌత్ లో ఇంత‌వ‌ర‌కూ ఇన్ని సీజ‌న్ల‌ను ఏ న‌టుడు హోస్ట్ చేయ‌లేదు. ఆ ర‌కంగా కిచ్చా పేరిట అదో రికార్డు.

అయితే తాజాగా సుదీప్ బిగ్ బాస్ హోస్టింగ్ విష‌యంలో సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇక‌పై ఈ షోకు హోస్టింగ్‌ చేయ‌న‌ని ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న సీజ‌న్ గ్రాండ్ ఫినాలే త‌ర్వాత తాను ఈ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాతగా చేయ‌బోన‌ని వెల్ల‌డించాడు. గ‌త 11 సీజ‌న్ల‌ను బాగా ఎంజాయ్ చేసాను. వ్యాఖ్యాత‌గా నాపై మీరు చూపిన ప్రేమకు ధ‌న్య‌వాదాలు. గ్రాండ్ ఫినాలేతో హోస్ట్‌గా నా ప్రయాణం ముగుస్తుంది.

ఇదే నా చివ‌రి హోస్టింగ్. మీ అంద‌రిని నా శ‌క్తి మేర‌కు అల‌రించాన‌ని భావిస్తున్నాను. ఇది ఎంతో గొప్ప ప్ర‌యాణం. ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది. నాకు ఈ అద్భుత‌మైన అవ‌కాశాన్ని క‌ల్పించిన‌ వారికి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు' అని రాసుకొచ్చారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఇప్పుడు క‌న్న‌డ‌లో కొత్త హోస్ట్ ని వెతికి ప‌ట్టుకోవాలి. శాండిల్ వుడ్ లో సుదీప్ స్టార్ హీరో. అత‌డి కంటూ ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది. 11 సీజ‌న్ల‌ను సుదీప్ దిగ్విజ‌యంగా పూర్తి చేసాడు.

ఇప్పుడు అత‌ని స్థానంలో కొత్త హీరోని తీసుకొచ్చి నిర్వాహ‌కులు అత‌డికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది అంత ఈజీ ప్రోస‌స్ కూడా కాదు. చాలా ఎఫెర్ట్ పెట్టి చేయాల్సిన ప‌ని. అందుకే నిర్వాహ‌కులు కూడా హోస్ట్ విష‌యంలో వీలైనంత వ‌ర‌కూ అనుభ‌వం గ‌ల వారినినే కంటున్యూ చేయాల‌ని చూస్తున్నారు. నాగార్జున కూడా బిగ్ బాస్ లో అలాగే పాతు కుపోయారు. బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన కూడా అలాగే హోస్ట్ చేస్తున్నారు.