ఇలా చేస్తే అస్సలు ఊరుకోను.. నెటిజన్స్ కు కిచ్చా సుదీప్ మాస్ వార్నింగ్ ..
కన్నడలో 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో కు మొదటినుంచి కిచ్చా సుదీప్ నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 17 Oct 2024 9:40 AM GMTఈగ మూవీలో విలన్ గా నటించిన కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ మూవీలో విలన్ గా అద్భుతమైన నటనతో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఈ యాక్టర్ కి కన్నడలో కూడా మాంచి క్రేజ్ ఉంది. ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలలో హీరోగా నటించిన కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కన్నడలో 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో కు మొదటినుంచి కిచ్చా సుదీప్ నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ భాష ఏదైనా బుల్లితెర ప్రేక్షకుల మనసులో ఏర్పరచుకున్న స్థానం మాత్రం సుస్థిరమనే చెప్పాలి. మరి ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ అంటే నాగార్జున ఎలా గుర్తు వస్తారో కన్నడలో బిగ్ బాస్ పేరు చెప్తే సుదీప్ వెంటనే గుర్తొస్తారు. కన్నడ బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ అంటే సుదీప్.. సుదీప్ అంటే బిగ్ బాస్ అనడంలో డౌటే లేదు. వారు అంతగా సుదీప్ తో బిగ్ బాస్ షో ని ముడి పెట్టేశారు.
ఈ నేపథ్యంలో కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 తరువాత తాను ఈ షో నుంచి తప్పుకోబోతున్నట్లుగా సుదీప్ అనౌన్స్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అవ్వడంతో పాటు దీని వెనుక కారణం అంటూ పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. మరోపక్క సుదీప్ తీసుకున్న ఈ నిర్ణయంతో కన్నడ బిగ్ బాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. తాను నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనడం లేదు అని అధికారికంగా వెల్లడించిన సుదీప్.. తాను పూర్తి చేయాల్సిన కొన్ని పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా వివరించారు.
అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం సుదీప్ ..బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతున్న ఛానల్ కారణంగా షో నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో రంగంలోకి దిగిన సుధీ.. తనపై వస్తున్న అత్తా అప్పుడు సమాచారాల గురించి బాగా సీరియస్ అయ్యారు.. ఇదే విషయాన్ని తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతున్న ఛానల్ కు తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ ఛానల్ తనను అగౌరవపరిచినట్టు నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ని కొట్టి పారేశారు. అంతేకాదు తాను పనిచేస్తున్న టీం పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోను అంటూ ఓ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.