Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌న్ కేసుపై కిచ్చా సుదీప్-ఉపేంద్ర వ్యాఖ్య‌లు

దర్శన్ అరెస్టుపై క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర‌ తన అభిప్రాయాన్ని షేర్ చేసారు. X (గతంలో ట్విట్టర్)లో తన పోస్ట్‌లో ఈ కేసును దేశవ్యాప్తంగా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఉపేంద్ర పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 5:13 PM GMT
ద‌ర్శ‌న్ కేసుపై కిచ్చా సుదీప్-ఉపేంద్ర వ్యాఖ్య‌లు
X

ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ స‌హ‌న‌టుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ హత్య కేసులో సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. దర్శన్ తూగుదీప తన సహనటి, ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మరో 11 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు రేణుకా స్వామిని శిక్షించమని ప‌విత్ర‌ గౌడ దర్శన్‌ను ప్రేరేపించారని సోర్సెస్ చెబుతున్నాయి. ఈ కేసు గురించి ద‌ర్శ‌న్ స‌హ‌చ‌రుడు అయిన కిచ్చా సుదీప్ స్పందించారు.

''న్యాయం వేరు స్నేహం వేరు.. రేణుకా స్వామి కుటుంబానికి న్యాయం జరగాలి.., దోషులు ఎవరైనా శిక్షించబడాలి.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయడం ముఖ్యం అని కిచ్చా సుదీప్ విలేకరులతో అన్నారు. రేణుకా స్వామి భార్య, కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని అన్నారు.

నిష్పక్షపాతంగా విచారించాలి: ఉపేంద్ర

దర్శన్ అరెస్టుపై క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర‌ తన అభిప్రాయాన్ని షేర్ చేసారు. X (గతంలో ట్విట్టర్)లో తన పోస్ట్‌లో ఈ కేసును దేశవ్యాప్తంగా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఉపేంద్ర పేర్కొన్నారు. అత్యంత కీలకమైన ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరాడు. ఇప్పటివరకు, దివ్య స్పందన, రామ్ గోపాల్ వర్మ, కిచ్చా సుదీప్ కొనసాగుతున్న కేసు గురించి ఓపెన్ అయ్యారు.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న దర్యాప్తును కర్ణాటకలోనే కాకుండా భారతదేశం అంతటా చూస్తున్నారు. ఈ హైప్రొఫైల్ కేసు విచారణలో నిష్పక్షపాత నిర్ణయం న్యాయం కోసం ఎదురుచూస్తున్నాము! అని వ్యాఖ్యానించారు. రేణుకాస్వామి కుటుంబానికి, ప్రజలకు, మీడియాకు, దర్శన్ అభిమానులకు కొంత అనుమానం ఉందని ఆయన అన్నారు. అటువంటి ఉన్నతమైన కేసుల్లో దర్యాప్తు జరుగుతున్న తీరులో పారదర్శకత ఉండేలా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఉపేంద్ర‌ ప్రస్తావించిన కొన్ని సూచనలు ఇలా ఉన్నాయి. ''ఏదైనా కేసు విచారణ వీడియో ఫుటేజీ సాక్షుల వివరాలన్నింటినీ పోలీసులు సంబంధిత వ్యక్తుల కుటుంబాలతో ఎప్పటికప్పుడు షేర్ చేయాలి. గతంలో పోలీసులు విచారణ వివరాలను రాతపూర్వకంగా నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. ప్రతిదీ రికార్డ్ చేసి ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు.. పారదర్శకంగా విచారణ జరపడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేయడం, ప్రభావవంతమైన వ్యక్తుల జోక్యం, అవినీతికి తావు ఉండదని కూడా ఉపేంద్ర స్పష్టం చేశారు.

రేణుకాస్వామి ని హత్య చేసిన కేసులో దర్శన్, అతని భాగస్వామి పవిత్ర గౌడ మరో 10 మందిని అరెస్టు చేశారు. రేణుకాస్వామి పవిత్రకు అవమానకరమైన సందేశాలు పంపాడని, అది అతని అపహరణకు దారితీసిందని క‌థ‌నాలొచ్చాయి. ఆ తర్వాత బెంగళూరులోని సుమనహళ్లి వంతెన వద్ద శవమై కనిపించాడు.