రిటైర్మెంట్ పై స్టార్ హీరో కామెంట్స్..!
ఎంత స్టార్ అయినా కూడా ఏదో ఒక టైం లో బోర్ కొట్టేస్తాడు. ప్రతిదానికీ ఒక టైం ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక హీరోగా తానెప్పుడు ఎవరినీ సెట్ లో వెయిట్ చేయించలేదు.
By: Tupaki Desk | 14 Jan 2025 1:30 PM GMTకన్నడ స్టార్ డైరెక్టర్ కిచ్చా సుదీప్ తన రిటైర్మెంట్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 28 ఏళ్లుగా కన్నడ పరిశ్రమలో తన స్టార్ డం కొనసాగిస్తున్న సుదీప్ కేవలం కన్నడలోనే కాదు మిగతా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చారు. కన్నడ స్టార్ గా ఎదిగిన సుదీప్ తన సినిమా జర్నీని కథానాయకుడిగానే ఆపేస్తానని హిట్ ఇచ్చారు. ఐతే తానింకా అలసిపోలేదు.. ఏదో ఒక టైం లో యాక్టింగ్ ఆపేస్తానని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు సుదీప్.
ఎంత స్టార్ అయినా కూడా ఏదో ఒక టైం లో బోర్ కొట్టేస్తాడు. ప్రతిదానికీ ఒక టైం ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక హీరోగా తానెప్పుడు ఎవరినీ సెట్ లో వెయిట్ చేయించలేదు. ఐతే తాను సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరొకరి కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేదని తెగేసి చెప్పారు సుదీప్. బ్రదర్, అంకుల్ రోల్స్ చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు సుదీప్.
ఇక ఈమధ్య కొన్ని ప్రాజెక్ట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేయలేదని ఈ టైం లో వాటిని చేయడం కరెక్ట్ కాదనే ఆ సినిమాలు చేయలేదని అన్నారు సుదీప్. నటనకు దూరమైనా ఇండస్ట్రీకి దూరం కానని హీరోగా పాత్రలు రానప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తానని అన్నారు సుదీప్. కన్నడ ఆడియన్స్ కు దాదాపు 30 ఏళ్లుగా తన సినిమాలతో అలరిస్తూ వస్తున్న సుదీప్ సపోర్టింగ్ రోల్స్ చేయడం ఇష్టం లేదనే విషయాన్ని వెల్లడించారు.
తెలుగులో సుదీప్ 2012 లో ఈగ సినిమా చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా లో సుదీప్ విలనిజం ఫ్యాన్స్ ని అలరించింది. సుదీప్ లేటెస్ట్ స్టేట్మెంట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈమధ్యనే మ్యాక్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుదీప్ ఆ సినిమాతో పర్వాలేదు అనిపించారు. సౌత్ లో క్రేజీ స్టార్ గా సుదీప్ 3 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుండగా తన మార్క్ నటనతో హీరోగా అదరగొట్టేస్తున్నారు. స్టార్ హీరోగా సుదీప్ తన స్పెషాలిటీ చూపిస్తున్నారు.