Begin typing your search above and press return to search.

కిచ్చా సుదీప్ 'మ్యాక్స్'​.. వీడితో పెట్టుకుంటే చావే..

ఈ గ్లింప్స్​ ఆద్యంతం. మంచి పవర్​ఫుల్​గా ఆకట్టుకునేలా ఉంది. 'నార్త్ డైరెక్షన్​లో పది బండ్లతో హెవీ వెహికల్స్​తో వస్తున్నార్​ సార్​.

By:  Tupaki Desk   |   2 Sep 2023 6:00 AM GMT
కిచ్చా సుదీప్ మ్యాక్స్​.. వీడితో పెట్టుకుంటే చావే..
X

'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్​. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియెన్స్​లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్​ చేసుకున్న ఆయన.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లెవల్​లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన 46వ సినిమా టైటిల్​ టీజర్​ను రిలీజ్​ చేశారు.

సినిమాకు మ్యాక్స్​ అనే టైటిల్​ను ఖరారు చేస్తూ మేకర్స్​ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్​ ఆద్యంతం. మంచి పవర్​ఫుల్​గా ఆకట్టుకునేలా ఉంది. 'నార్త్ డైరెక్షన్​లో పది బండ్లతో హెవీ వెహికల్స్​తో వస్తున్నార్​ సార్​. వెస్ట్​ నుంచి 12, ఈస్ట్ నుంచి 13 హెహికల్స్​' అంటూ బ్యాక్​గ్రౌండ్​లో వాయిస్​ రాగా.. 'రాబోయే వాళ్ల అగ్నిపర్వతం నుంచి తప్పించుకోవచ్చు, భుకంపం నుంచి తప్పించుకోవచ్చు, తుపాను, సునామీ నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ వీడితో పెట్టుకుంటే చావు లేని వరంతో పుట్టినోడు కూడా చస్తాడు' అంటూ హీరో కిచ్చా సుదీప్​ ఎలివేషన్ ఇవ్వడం బాగుంది.

ఎన్నో హై రేంజ్ గన్స్​ చుట్టూ ఉన్నా.. వాటిని పక్కనపెట్టి లాఠీ పట్టుకుని నడుస్తూ కనిపించారు సుదీప్​. ఇక ఈ సీన్స్​కు కాంతార ఫేమ్​ అజనీశ్ లోక్​నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్​గా ఉంది. కానీ కిచ్చా సుదీప్​ ఫేస్​ను రివీల్ చేయలేదు మేకర్స్​. ఇక పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో భారీ మిషన్ గన్​తో నించోని కనిపించారు సుదీప్​. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్​ చేయనున్నారు.

ఇక ఈ సినిమాకు విజయ్​ కార్తికేయ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సూపర్ హిట్ సినిమా 'అసురన్​'ను నిర్మించిన కలైపుల్లి ఎస్​ తను ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్​తో దీన్ని నిర్మిస్తున్నారు. వీ క్రియేషన్స్​ బ్యానర్​లో కిచ్చా క్రియేషన్స్​తో కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్​ కు రెడీ అవుతోంది.

ఇకపోతే కిచ్చా సుదీప్​.. తెలుగులో తన మొదటి సినిమా 'ఈగ'లో విలన్ రోల్​లో కనిపించి ఆకట్టుకున్నారు. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా ముందుంటారు. అందుకే కన్నడలో స్టార్ హీరో అయినప్పటికీ 'బాహుబలి', 'సైరా' లాంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ కనిపించి ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా లెవల్​లో క్రేజ్​ సంపాదించుకున్నారు. రీసెంట్​గా 'విక్రాంత్ రోణ' చిత్రాంతో పాన్​ ఇండియా లెవెల్​లో వచ్చి ఆకట్టుకున్నారు. ఈ సినిమా మంచిగానే ఆడింది.