Begin typing your search above and press return to search.

OTT ఆడియన్స్ ను 'కిల్' చేసేందుకు సిద్ధం..!

ఐతే అనూహ్యంగా కిల్ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ నుంచి గ్రేట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:41 AM GMT
OTT ఆడియన్స్ ను కిల్ చేసేందుకు సిద్ధం..!
X

సరైన కంటెంట్ తో వస్తే ఆ సినిమా ఎప్పుడైనా ఎక్కడైనా ఆడుతుందని ప్రూవ్ చేసిన సినిమా కిల్. బాలీవుడ్ లో ఒక హుషారైన వాతావరణం క్రియేట్ చేసిన సినిమా అది. ప్రభాస్ కల్కి 2898 AD సినిమా రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న టైం లో ఆ సినిమా రిలీజైన వారం తర్వాత చాలా డేర్ గా కిల్ సినిమా రిలీజ్ చేశారు. ఐతే అనూహ్యంగా కిల్ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ నుంచి గ్రేట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ సినిమా చూసిన ఆడియన్స్ అందులోని యాక్షన్ బ్లాక్ లను వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమా తమకు ఎంతగా నచ్చిందో చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ బాక్సాఫీస్ పై కిల్ చూపించిన జోష్ అంతా ఇంతా కాదు. నిఖిల్ నగేష్ భట్ డైరెక్ట్ చేసిన కిల్ సినిమాలో లక్ష్య, తన్య మనిక్తల, రాఘవ్ జుయాల్ లీడ్ రోల్ లో నటించారు. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ చూడని వారు డిజిటల్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కిల్ సినిమా ఓవర్సీస్ లో డిజిటల్ రిలీజైంది. అమెజాన్ ప్రైం వీడియో ద్వారా ఓవర్సీస్ ఆడియన్స్ కి కిల్ సినిమా ఎక్స్ పీరియన్స్ అవుతుంది.

ఐతే ఇండియాలో మాత్రం కిల్ సినిమా రిలీజ్ అవ్వలేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కిల్ సినిమా రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 6 నుంచి కిల్ సినిమా అందుబాటులో రానుంది. హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని తెలుస్తుండగా మిగతా భాషల గురించి తెలియాల్సి ఉంది. కిల్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారన్న టాక్ నడిచింది. అలా అయితే మాత్రం సినిమా తెలుగు వెర్షన్ ఉండకపోవచ్చు. ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కిల్ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

కిల్ సినిమా తెలుగు రీమేక్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఐతే సెప్టెంబర్ 6న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతున్న కిల్ సినిమా తెలుగు వెర్షన్ లేకపోతే మాత్రం కచ్చితంగా రీమేక్ కు సంబంధించిన అప్డేట్ ఉంటుందని చెప్పొచ్చు.